వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క ఓటమికే వెన్నుచూపే తత్వం కాదు..! మడమతిప్పకుడా ప్రజాపక్షాన పోరాటం చేస్తానంటున్న పవన్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరామాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చినట్టు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన జనసేనాని,ప్రభుత్వ పనితీరుమీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజాపక్షాణ నిలబడితే సరిపోతుందని అందుకు రాజకీయ పదవులు అవసరం లేదని గబ్బర్ సింగ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే అమరావతి పార్టీ కార్యాలయంలో పార్టీ పటిష్టత కోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. అంతే కాకుండా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని సిద్దం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

 స్థానిక ఎన్నికల్లో బలంగా నిలవాలి..! పార్టీ శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ పిలుపు..!!

స్థానిక ఎన్నికల్లో బలంగా నిలవాలి..! పార్టీ శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ పిలుపు..!!

'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి. జనసేనలో డైనమిక్‌ లీడర్లున్నారు. ఒక్క ఎన్నికల్లో ఓడినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచండి. మీ వెనక నేనుంటాను' అని ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. పార్టీ కీలక నేతలతో రెండురోజులపాటు వివిధ అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలమైన పార్టీగా నిలవాలని ఆకాంక్షించారు. ఎన్నికలకు 3-4నెలల సమయం ఉందని.. ఈలోగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపిచ్చారు. ఇందుకు సంబంధించి ఏర్పాటైన కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పాత విషయాల్ని పక్కన పెట్టి, భయాన్ని విడిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ప్రజలకు బాసటగా నిలిచేందుకు కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

సమరానికి జనసైనికులు సిద్ధమవ్వాలి..! సత్తా చాటాలన్న గబ్బర్ సింగ్..!!

సమరానికి జనసైనికులు సిద్ధమవ్వాలి..! సత్తా చాటాలన్న గబ్బర్ సింగ్..!!

జనసేన ఒక్క కులానికి మాత్రమే పరిమితం కాదన్నారు. కులాల్ని కలిపే ఆలోచన మన పార్టీ సిద్ధాంతాల్లో ప్రధాన అంశంగా ఉందని గుర్తుచేశారు. జనసేనలో కాపులను గౌరవిస్తామన్న ఆయన.. ఆ ముద్ర వేసుకోమని స్పష్టం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలూ అదే విధంగా ఉండాలని సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రతినిధులను, ప్రజలను పవన్‌ కలిశారు. ఇతర జిల్లాల నుంచి గుంటూరు ప్రాంతానికి వలస వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. తమ సొంత గ్రామాల్లో పొలాలున్నా, వ్యవసాయం చేసేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల కూలీపనులకు వచ్చామని చెప్పారు. వయసు మీదపడ్డా పెన్షన్లు ఇవ్వడం లేదని వాపోయారు.

జనసేనకు కులం లేదు..! సమన్యయమే లక్ష్యంగా పనిచేద్దామన్న కాటమ రాయుడు..!!

జనసేనకు కులం లేదు..! సమన్యయమే లక్ష్యంగా పనిచేద్దామన్న కాటమ రాయుడు..!!

జనసేన పార్టీ కమిటీల నిర్మాణం, ప్రజా సంబంధిత కార్యక్రమాల నిర్వహణపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు విజయవాడలో పార్టీ ముఖ్య నాయకులతో, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో చర్చించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఏర్పాటైన కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించి ప్రజలకు బాసటగా నిలుద్దామన్నారు. ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల పక్షాన నిలిచే పార్టీ జనసేన అనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉందామని తెలిపారు. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన ప్రణాళికలపై పోటీ చేసిన అభ్యర్థులతో విడివిడిగా చర్చించారు.

 పూర్తి స్థాయిలో పార్టీకే అంకితం..! తాడోపేడో తేల్చుకోవాలంటున్న సేనాని..!!

పూర్తి స్థాయిలో పార్టీకే అంకితం..! తాడోపేడో తేల్చుకోవాలంటున్న సేనాని..!!

మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం పార్టీ శ్రేణులనీ, వివిధ వర్గాల ప్రతినిధులను, ప్రజలను పవన్ కల్యాణ్ కలిశారు. గుంటూరు ప్రాంతానికి ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన కొందరు మాట్లాడుతూ తమకు సొంత గ్రామాల్లో వ్యవసాయం ఉన్నా కలిసి రాకపోవడం వల్లే కూలీ పనులకు వచ్చామని చెప్పి... వయసు మీదపడ్డా పెన్షన్లు ఇవ్వలేదని వాపోయారు. రైతులు తమ ఇబ్బందులను వివరించారు. విద్యార్థులు, యువతీయువకులతో పవన్ కల్యాణ్ గారు ముచ్చటించారు. పార్టీ కార్యాలయంలో పెంచుతున్న గోవులకు నమస్కరించి వాటి ఆలనా పాలన గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ నిర్మాణపనులను పరిశీలించారు.

English summary
'Prepare for local bodies elections. Janasena has dynamic leaders. There is no need to be afraid of losing an election. Have faith in me. I will be behind you, ”assured Opposition President Pawan Kalyan. Various issues were discussed with key leaders of the party for two days. He also directed the party to strengthen its tactics in the election of local bodies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X