వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సెక్రటేరియట్ లో మ‌రొక‌రికి క‌రోనా.!ఇరవైకి చేరువలో కేసులు.!ఉద్యోగులలో నెలకొన్న ఆందోళన..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం అట్టుడుకుతుంటే కరోనా వైరస్ తన పని తాను చల్లగా చేసుకుపోతోంది. అక్కడ ఇక్కడ మరెక్కడో కాకుండా సాక్షాత్తూ ప్రభుత్వం యంత్రాంగం కొలువుదీరే ప్రదేశంలోనే తన ప్రతాపాన్ని చూపిస్తోంది మహమ్మారి వైరస్. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకే దగ్గర కొలువయ్యే సచివాలయం ఉద్యోగుల మీద కరోనా తన పంజా విసురుతోంది.

Recommended Video

COVID-19 : One More Corona పాజిటివ్ Case In AP సెక్రటేరియట్

మొన్న హరీష్ సిబ్బంది, నిన్న మేయర్ డ్రైవర్, నేడు ముత్తిరెడ్డి.!తెలంగాణను కరోనా కాటేస్తోందా.? మొన్న హరీష్ సిబ్బంది, నిన్న మేయర్ డ్రైవర్, నేడు ముత్తిరెడ్డి.!తెలంగాణను కరోనా కాటేస్తోందా.?

నిన్నటి వరకూ పద్నాలుగు మంది మీద విరుచుకు పడ్డ కరోనా నేడు మరో ఉద్యోగికి వైరస్ సోకింది. ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న పాజిటీవ్ కేసులతో ఉద్యోగుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. మరో పక్క సచివాలయ ఉద్యోగులు ఏపి ని ఒదిలి వెళ్లొద్దని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అమలులో ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితుల మద్య ఉద్యోగులు కాలం నెట్టుకొస్తున్నట్టు తెలుస్తోంది.

one more employee effected corona positive in ap secretariat..!

ఇదిలా ఉండగా నీటి పారుదల శాఖలో ప‌ని చేస్తున్న ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. తాజాగా న‌మోదైన కేసుతో క‌లిపి ఏపీ స‌చివాల‌యంలో క‌రోనా సోకిన వారి సంఖ్య పదిహేనుకు చేరినట్టు నిర్ధారణ అవుతోంది. కాగా, రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గకపోగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 222 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5858కు చేరింది.

ఇందులో రాష్ట్రంలో కొత్తగా 186 కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కృష్ణా జిల్లాలోనే రెండు మరణాలు సంభవించాయి. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది. అలాగే 2,591 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనా సెక్రెటేరియట్ ను వెంటాడుతుండడంతో ఉద్యోగులు కలవరపడుతున్నట్టు తెలుస్తోంది.

English summary
It is confirmed that the number of people who have been infected with the Coronation AP Secretariat has reached fifteen. The state has seen a total of 222 positive cases in the past 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X