వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వాన్ని పూర్తి కాలం ఉండ‌నివ్వ‌రా..! ఢిల్లీ కేంద్రంగా వేగంగా ప‌రిణామాలు: సీఎం అప్ర‌మ‌త్తం..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఇంకా రెండు నెల‌లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఏపీలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అయిదేళ్ల కాలం ఉండే ప‌రిస్థితి లేన‌ట్లు క‌నిపిస్తోంది.ఆ దిశ‌గా ఢిల్లీ కేంద్రంగా వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. బీజేపీ కీల‌క నేత లు త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆ మేర‌కు జ‌గ‌న్‌కు సైతం స్ప‌ష్ట‌మైన స‌మ‌చారం ఉంది. దీంతో..విమర్శ‌లు ఎలా ఉన్నా..తాను అధికారంలోకి రావ‌టానికి కార‌ణ‌మైన హామీలు అమ‌లు వేగాన్ని పెంచారు. పాల‌న‌లో వాటికే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను కాపాడుకొని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఎంత కాలం ఉన్నా..తిరిగి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాన‌నే అంశంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని భావిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు అస‌లు ఢిల్లీలో ఏం జ‌రుగుతోంది...అప్ర‌మ‌త్త‌మైన జ‌గ‌న్ ఏం చేస్తున్నారు...

వైసీపి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది ! ఏపిలో తర్వాత అదికారం బీజేపిదే అంటున్న రాంమాధవ్‌ !!వైసీపి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది ! ఏపిలో తర్వాత అదికారం బీజేపిదే అంటున్న రాంమాధవ్‌ !!

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అయిదేళ్లు ఉండ‌దా..

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అయిదేళ్లు ఉండ‌దా..

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు నెల‌లు కావ‌స్తోంది. అప్పుడే జ‌గ‌న్ త‌న హామీల అమ‌లు కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. పాల‌న‌లో త‌న హామీల అమ‌లు కోస‌మే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. పూర్తిగా అయిదేళ్ల పాటు ప్ర‌భుత్వం ఉంటుం దా లేదా అనే చ‌ర్చ న‌డుమ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అప్ర‌మ‌త్తమ‌య్యారు. దీని కోసం చివ‌రి నిమిషం దాకా ఎదురు చూడ‌కుం డా ముందుగానే వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. తొలి సంత‌కం..తొలి బ‌డ్జెట్..తొలి బిల్లు అన్నీ తాను పాద‌యాత్ర స‌మ‌యంలో ఇచ్చిన హామీలు..మేనిఫెస్టోలో ప్ర‌తిపాదించిన అంశాల వారీగానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఆర్దికంగా ఏపీ క‌ష్టాల్లో ఉన్నా..జ‌గ‌న్ ఇన్ని వ‌రాలు..హామీలు ఎలా ఇస్తున్నారు..ఏ విధంగా అమ‌లు చేస్తార‌నే చ‌ర్చ ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. కానీ, జ‌గ‌న్ మాత్రం వెనుక‌డుగు వేయ‌టం లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఇచ్చిన హామీలు కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. త‌న ప్ర‌భుత్వం అయిదేళ్ల కాలం ఉండ‌నీయ‌క‌పోయినా.. ఎప్పుడు ఏ ర‌కంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సి వ‌చ్చినా..ముఖ్య‌మంత్రి స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

టార్గెట్ 2024 కాదు..2023..

టార్గెట్ 2024 కాదు..2023..

ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత తొలి వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో ఈ విజ‌యంతో బాధ్య‌త పెరిగింద‌ని చెబు తూనే..టార్గెట్ 2024 ల‌క్ష్యంగా ఇప్ప‌టి నుండే ప‌ని చేయాల‌ని జ‌గ‌న నిర్ధేశించారు. మంత్రి ప‌ద‌వుల విష‌యంలోనూ అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. అయితే, ఆ త‌రువాతే మార్పులు జ‌రిగాయి. ఢిల్లీ కేంద్రంగా ఆలోచ‌న‌లు..అడుగులు నిశి తంగా గ‌మ‌నిస్తూ..ఏపీలో జ‌గ‌న్ వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. అందులో భాగంగా..ముందుగా హామీల అమ‌లు.. ప్ర‌జా క‌ర్ష‌క ప‌ధ‌కాల‌కు నిధులు కేటాయింపు ద్వారా ముందుగా ప్ర‌జ‌ల్లో త‌న ఇమేజ్ పెంచుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌, అదే స‌మ‌యంలో టీడీపీకి ఎక్క‌డా అవ‌కాశం లేకుండా ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను డిసైడ్ చేసే కుల స‌మీక‌ర‌ణాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యత ఇస్తూ ఇక ఆ వ‌ర్గాలు టీడీపీకి ద‌గ్గ‌ర అవ్వ కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. టీడీపీకి బీసీ వ‌ర్గాల అండ గ‌త ఎన్నిక‌ల్లో ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. దీంతో..ఇక బీసీ వ‌ర్గాల‌ను పూర్తిగా వైసీపీకి మ‌ద్ద‌తుగా కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసారు. ఇదంతా త‌న పాల‌న ఎలా ఉన్నా..సామాజిక స‌మీక‌ర‌ణాల ద్వారా తిరిగి అధికారం ద‌క్కించుకోవ‌ట‌మే ల‌క్ష్యం.

ప్ర‌ధాని కోరారు..జ‌గ‌న్ మాట ఇచ్చారు..

ప్ర‌ధాని కోరారు..జ‌గ‌న్ మాట ఇచ్చారు..

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఢిల్లీలో ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న అఖిల ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మావేశంలో ప్ర‌ధాని దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న చేసారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక నినాదాన్ని వివ‌రించారు. దానికి ఏపీ సీఎం జ‌గ‌న్ సైతం మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో..జ‌గ‌న్ సైతం ముంద‌స్తుగానే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని స్ప‌ష్ట‌మైన స‌మాచారంతోనే ఏపీలో నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్నారు. ఇక‌, తాజాగా వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వే శ పెట్టాల‌ని ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యించారు. ఇది ఆమోదం పొందింతే 2022 చివ‌ర్లో లేదా 2023లో దేశ వ్యాప్తంగా అన్ని ఎన్నిక‌లు ఒకే సారి జ‌ర‌గ‌నున్నాయి. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్ త‌న ప్రభుత్వం అయిదేళ్ల కాలం పూర్తిగా ఉండ‌పోయినా.. ఎప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సి వ‌చ్చినా సిద్దంగా ఉండాల‌నే ఉద్దేశంతో సంక్షేమం..సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తు పొందే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో తొలి రెండు నెల్ల‌లోనే ఇన్ని హామీలు అమ‌లు స్పీఢ్ వెనుక అస‌లు కార‌ణం ఇదే అంటూ వైసీపీ ముఖ్య నేత‌లు అస‌లు విష‌యం చెబుతున్నారు.

English summary
One nation One Election Bill may proposed in coming parliament sessions. PM Modi given indications to party MP's in this decision.With this decision AP CM jagan also moving strategically for next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X