• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అనంతలో కీచకపర్వం.. ఉద్యోగం అడ్డు పెట్టుకుని.. ఉన్నతోద్యోగి కామ లీలలు..!

|

అనంతపురం : ఉన్నతోద్యోగంలో ఉన్నాడు. కానీ ఆలోచనలు మాత్రం ఉన్నతంగా లేవు. ఆ ఉద్యోగాన్నే అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్నాడు. సదరు కీచకుడి చేతిలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో యువతులు బలయ్యారు. సంక్షేమ పథకాలను ఎరగా చూపుతూ అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాడు. దారికొస్తే ఓకే.. లేదంటే భయపెడుతూ తన పని కానిచ్చేస్తున్నాడు.

అనంతపురం జిల్లాలో ఉన్నతాధికారిగా ఉద్యోగం వెలగబెడుతున్న ఓ ఆఫీసర్ కీచకపర్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫిర్యాదులు లేకపోవడంతో అతడిపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోతోంది. సంక్షేమ పథకాలను ఆశగా చూపుతూ యువతులను బుట్టలో వేసుకుంటాడనే పేరుంది. జిల్లాకు వచ్చిన నాలుగేళ్లలో సదరు అధికారి వికృత చేష్టలకు చాలామంది యువతులు బలయ్యారనే టాక్ వినిపిస్తోంది.

ఉన్నతోద్యోగి కాదు కీచకుడు

ఉన్నతోద్యోగి కాదు కీచకుడు

అనంతపురం జిల్లాలో కీలక పోస్టులో ఉన్న ఓ ఉన్నతాధికారి.. పని నిమిత్తం తన దగ్గరకొచ్చే మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు జోరందుకున్నాయి. ప్రధానంగా తల్లిదండ్రులు లేని, ఆసరా లేని యువతులే లక్ష్యంగా ఆ కీచకుడు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తన మాట వింటే సరే.. లేదంటే సంక్షేమ పథకాల్లో కోత కోస్తానంటూ బెదిరిస్తూ చాలామందిని లోబర్చుకున్నట్లు వినికిడి.

లబ్ధిదారులకు సాయం చేయడానికే తాను పుట్టాననే లెవెల్లో బిల్డప్ ఇస్తారట. ఇక ఆఫీసు సమయాల్లో అందుబాటులో ఉండక.. సాయంత్రం 5 గంటల తర్వాత కార్యాలయానికి చేరుకుంటారట. తన అవసరమున్నవారికి సాయంత్రమే రావాలంటూ సూచిస్తుండటం గమనార్హం. అలా వచ్చిన వారికి సాయం చేస్తానంటూ భరోసా ఇస్తూ తన మనసులోని మాట బయటపెడతారట. వింటే ఓకే.. లేదంటే వారికి చుక్కలు చూపిస్తాడనే పేరుంది.

25 ఏళ్లుగా బీజేపీకి దిక్కు లేదు.. కాలం చెల్లిన నేతలకు కండువా.. మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు

ఆఫీస్ వేళల్లో అందుబాటులో ఉండక.. చీకటి పడ్డాకే..!

ఆఫీస్ వేళల్లో అందుబాటులో ఉండక.. చీకటి పడ్డాకే..!

ఇక తనిఖీల పేరిట లబ్ధిదారుల ఇళ్లల్లోకి చొరబడతారనే ప్రచారం జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేయాల్సి ఉన్న సదరు అధికారి మాత్రం పొద్దంతా కార్యాలయం పరిసరాల్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించబోరట. సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రం ఠంచనుగా ఆఫీసుకొస్తారట. ఆ క్రమంలో తనిఖీలంటూ ఊరి మీద పడి తనలోని కామాంధుడ్ని బయటకు రప్పిస్తాడట.

ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థినిని మాయమాటలతో లొంగదీసుకున్నట్లు సమాచారం. ఆమెను వివాహం చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలో కార్యాలయంలోని ఓ ఉద్యోగితో పాటు కొందరు వ్యక్తులు ఆమెను ఒప్పించినట్లు తెలుస్తోంది. నగర శివారులో రహస్య కాపురం పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెకు బ్యాక్‌లాగ్ పోస్టు ఇప్పిస్తానంటూ ఎర వేసి అక్రమంగా పెళ్లి చేసుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

గతంలో దేహశుద్ధి.. తీరు మారని కామాంధుడు

గతంలో దేహశుద్ధి.. తీరు మారని కామాంధుడు

మంత్రులను, ఉన్నతాధికారులను బురిడీ కొట్టించే నైజమున్న సదరు అధికారి తన కామలీలల్ని యధేచ్ఛగా సాగిస్తారనే పేరుంది. జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వాటికి మంత్రులను, ఉన్నతాధికారులను ఆహ్వానిస్తూ తనకు ఎదురు లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇదివరకు చిత్తూరు జిల్లాలో పనిచేసినప్పుడు ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తే దేహశుద్ది జరిగిందట. అయినా కూడా ఈ కామాంధుడిలో మార్పు రాకపోవడం గమనార్హం. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలోనూ అలాంటి చేదు అనుభవమే ఎదురైందట. నాయకులను మచ్చిక చేసుకుని వారి అండతో నాలుగేళ్లుగా జిల్లాలో రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూరుస్తానంటూ కొందర్ని లోబర్చుకున్నా.. వారికి సింగిల్ రూపీ కూడా న్యాయం చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా అతడిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోతుండటం గమనార్హం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Allegations are leveled against One Officer Harassment. Who is seeking a job as a senior officer in anantapur distirct, but action is being taken against him for lack of complaints.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more