వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధకు ఏడాది- 7 గంటలకు చప్పట్లు కొట్టాలన్న జగన్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో గ్రామ స్వరాజ్యం దిశగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా సీఎం జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2 ఈ వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఏపీలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను ప్రశంసించారు.

Recommended Video

#GramaSwarajyamInAP : గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి CM Jagan అభినందనలు! || Oneindia

పట్టించుకోని వైసీపీ- మిత్రుల్ని దూరం చేస్తున్న టీడీపీ- రెంటికీ చెడ్డ రేవడిగా గంటా పరిస్ధితి..పట్టించుకోని వైసీపీ- మిత్రుల్ని దూరం చేస్తున్న టీడీపీ- రెంటికీ చెడ్డ రేవడిగా గంటా పరిస్ధితి..

ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఏడాది పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధపై సీఎం జగన్‌ ప్రశంసలు కురిపించారు. మన గ్రామాల్లో మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయం కావాలన్నాకూడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోంది.
ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గ్రామ స్వరాజ్యం మన అందరికీ కూడా కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా మనకు సేవలు చేస్తున్నారని జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

 one year for ap secretariats and volunteer system, jagan calls for clapping at 7pm today

ఈరోజు సాయంత్రం 7 గంటలకు మనకు మంచి సేవలు అందిస్తున్న వీరందరినీ అభినందిస్తూ ఇళ్లనుంచి బయటకు వచ్చి చప్పట్టు కొట్టి అభినందించాలని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్నా. నేను కూడా సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చి నా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొడతాను. మన వంతు ఆదరణ వారికి చూపించాలన్నారు.

English summary
andhra pradesh chief minister ys jagan has expressed happy over completing one year of village, ward secretariats and volunteer system in the state. cm jagan calls for clapping to encourage volunteers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X