వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టులకు సదవకాశం: జిల్లా కేంద్రాల్లో ఫ్రీలాన్సర్స్ కావాలి

బహుభాషా పోర్టల్ వన్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే వన్ ఇండియా తెలుగు కూడా బహుముఖంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బహుభాషా పోర్టల్ వన్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే వన్ ఇండియా తెలుగు కూడా బహుముఖంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. దశాబ్దాలుగా నిజాయితీగా, నిబద్ధతగా వార్తలను, వార్తాకథనాలను అందిస్తూ పాఠకుల మన్ననలను పొందింది.

వన్ ఇండియా తెలుగు కోసం పనిచేయడం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. నిష్పక్షపాతంగా, నిజాయితీగా వార్తలను అందించడమే దానికి కారణం. వన్ ఇండియా తెలుగు జిల్లా కేంద్రాల్లో ఫ్రీలాన్సర్స్‌ను నియమిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి ఉండి, వార్తలనూ సంఘటనల వెనక కారణాలను రాయగలిగీ విశ్లేషించగలిగే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Oneindia needs freelancers at district head quarters

మీరు రాసిన వార్తలను బట్టి మీకు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. రాసిన వార్తలను బట్టి అందుకు అనుగుణంగా తగిన పారితోషికం ఉంటుంది. ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటుంది. ఇరు రాష్ట్రాల జిల్లా కేంద్రాల నుంచి వార్తలను రాయడానికి ఆసక్తి చూపే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా రెండు రాష్ట్రాల్లో ఇతర ముఖ్యమైన ప్రాంతాలవారు కూడా సంప్రదించవచ్చు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి కూడా ఫ్రీలాన్సర్స్‌ను ఆహ్వానిస్తున్నాం.

ఈ కింది మెయిల్ అడ్రస్‌కు తమ దరఖాస్తులను పంపించాల్సిందిగా కోరుతున్నాం. లేదా ఆసక్తిగల వారు కింద ఇచ్చిన ఫోన్‌కు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు.

మెయిల్ అడ్రస్: [email protected]
Cell: 9848956375

English summary
Oneindia Telugu is inviting applications for freelancer journalists from district headquarters of Telangana and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X