వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్ ఆర్డర్ ఇస్తే గడియారం.. ఇంకేదో కొంటే ఖాళీ బాక్స్.. ఆన్‌లైన్‌ షాపింగ్ లీలలు..?

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఆన్‌లైన్ షాపింగ్ లీలలు అన్నీ ఇన్నీ కావు. కూర్చున్న చోటు నుంచే కావాల్సినవి ఆర్డరిచ్చే రోజులొచ్చాయి. కానీ, అంత ఈజీ ప్రాసెస్ వెనుక లొసుగులు కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి. యాంత్రిక జీవనంలో ఉరుకులు పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఆ క్రమంలో ఇంటి నుంచో, ఆఫీసునుంచో ఏది కావాలంటే అది ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేస్తున్నారు చాలామంది. అయితే కొన్ని సందర్భాల్లో ఖాళీ బాక్సులు దర్శనమివ్వడం.. మరికొన్ని సమయాల్లో ఒకటి కొంటే మరో వస్తువు పంపించడం వినియోగదారుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు ఘటనలు ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

ఆన్‌లైన్ షాపింగ్ తికమక.. ఖాళీ బాక్స్ దర్శనం..!

ఆన్‌లైన్ షాపింగ్ తికమక.. ఖాళీ బాక్స్ దర్శనం..!

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు పంచాయతీ బెస్తపల్లెకు చెందిన ఆనంద్ అనే యువకుడికి ఆన్‌లైన్ షాపింగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల అనారోగ్య కారణాలతో తనకు మోకాళ్ల కింది భాగంలో సర్జరీ జరిగిందని.. ఆ క్రమంలో ఆరోగ్య పరికరం కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతుండగా ఓ ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో గ్లోబల్ నర్వ్ సిక్స్ ప్యాక్ పేరుతో ఐటమ్ కనిపించిందట. దాంతో 4 వేల 990 రూపాయల విలువ చేసే ఆ పరికరాన్ని క్రెడిట్ కార్డుతో బుక్ చేశారు.

ఆనంద్ బుకింగ్ మేరకు వారం రోజుల తర్వాత చిన్న బాక్సు ఒకటి కొరియర్ ద్వారా పంపించింది సదరు సంస్థ. అయితే దాన్ని తెరిచి చూడగా ఖాళీ బాక్స్ దర్శనమిచ్చింది. అందులో రెండు కవర్లు తప్ప మరేమీ కనిపించలేదు. దాంతో ఆయన వెంటనే ఎక్కడి నుంచి తనకు ఆ బాక్స్ వచ్చిందో ఆ అడ్రస్‌కు జరిగిన విషయం సమాచారం అందించారు. అక్కడి సిబ్బంది ఆ బాక్స్ వెనక్కి పంపితే పరిశీలిస్తామని సమాధానం ఇచ్చారట. దాంతో సంతృప్తి చెందని ఆనంద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

<strong>ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!</strong>ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!

మొబైల్ ఫోన్ ఆర్డరిస్తే.. గడియారం పంపించారు..!

మొబైల్ ఫోన్ ఆర్డరిస్తే.. గడియారం పంపించారు..!

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడు వారం రోజుల కిందట దిన పత్రికలో వచ్చిన యాడ్ చూసి మొబైల్ ఫోన్ కొందామని డిసైడయ్యాడు. తక్కువ ధరకు వస్తుండటంతో ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. ఆ మేరకు సదరు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ శనివారం నాడు కొరియర్ ద్వారా ఓ బాక్స్ డెలివరీ చేసింది. తీరా అది ఓపెన్ చేసి చూసిన సదరు యువకుడు కంగు తిన్నాడు.

ఫోన్ బుక్ చేస్తే గడియారం రావడం చూసి షాకయ్యాడు సదరు యువకుడు. వెంటనే ఆ బాక్స్ అందించిన కొరియర్ బాయ్‌ను నిలదీయడంతో తనకేమీ తెలియదని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ నోట ఈ నోట ఈ వార్త దావానంలో వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల్లో చర్చానీయాంశంగా మారింది.

ఎక్కడ లోపం.. కస్టమర్లకు ఎందుకీ తలనొప్పులు..!

ఎక్కడ లోపం.. కస్టమర్లకు ఎందుకీ తలనొప్పులు..!

ఆన్‌లైన్ షాపింగ్‌లో తరచుగా ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం లోపం ఎక్కడుంది అనే విషయం గుర్తించలేకపోతున్నారు. వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించడంలో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు విఫలం అవుతున్నాయనే వాదనలు లేకపోలేదు. వేలాది రూపాయలు డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి చివరకు ఖాళీ బాక్సులో లేదంటే ఇతరత్రా వస్తువులు కనిపించడమో చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంటే.. ఇలాంటి ఘటనల వల్ల ఆయా సంస్థలు చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సి వస్తోంది. కస్టమర్లకు నాణ్యవంతమైన సేవలు అందించినప్పుడే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందనే చిన్న లాజిక్ మిస్సవుతుండటం గమనార్హం.

English summary
The demand for online shopping is so high these days that mechanical life is booming. In order for that to happen from home or office, many people order it online. But, online shopping sites sending empty boxes or another products. Two incidents took place in telugu states recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X