వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచారాల్లో మంత్రుల ఫోటోలు కట్... సీఎం ఫోటో మాత్రమే ఉండాలి... సీఎంవో ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల ప్రచారంపై కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలపై ఇప్పటివరకు ఉన్న మంత్రుల ఫోటోలు కనిపించకుండా పోనున్నాయి. ఆయా డిపార్ట్‌మెంట్‌ల ద్వార కొనసాగుతున్న పథకాలపై కేవలం సీఎం జగన్ ఫోటోలు మాత్రమే ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి సీఎంవో అధికారులు ఆయా విభాగాలకు అదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ పథకాల్లో నో మినిస్టర్స్ ఫోటోస్

ప్రభుత్వ పథకాల్లో నో మినిస్టర్స్ ఫోటోస్

రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ఇక నుండి ఆయా శాఖల మంత్రుల ఫోటోలకు బదులుగా కేవలం సీఎం ఫోటోలు మాత్రమే ఉండేవిధంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మీడియా, సోషల్ మీడీయాతోపాటు ఇతర ప్రచార కార్యక్రమాల్లో ఈ నిబంధనలు అమలు అయ్యెలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

సుప్రీం నిబంధనలు ఏం చెబుతున్నాయి

సుప్రీం నిబంధనలు ఏం చెబుతున్నాయి

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ద్వార అమలయ్యె పథకాలకు ప్రధాని మోడి ఫోటోలు, రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రుల ఫోటోలు మాత్రమే ఉండాలని, ఇందుకు సంబంధించి మంత్రుల ఫోటోలు వాడోద్దని ఆదేశాలు ఇచ్చిందని, కాని గత ప్రభుత్వం ఈ ఆదేశాలను పట్టించుకోలేదని ..ఇక వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడ ఇదే పద్దతి కొనసాగుతుందని భావించిన సీఎం జగన్ ప్రస్తుతం ఈ ఆదేశాలను జారీ చేశారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎంవో నుండి ఆదేశాలు వెళ్లాయి.

కడపలో సీఎం పర్యటన

కడపలో సీఎం పర్యటన

మూడు రోజుల పాటు సీఎం జగన్ కడరప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23,24,25 తేదీల్లో జగన్ పర్యటన కొనసాగనుంది.... పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది... ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌, మైదుకూరులో కుందు ప్రాజెక్ట్, రాయచోటిలో హంద్రినీవా ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం.

English summary
only c.m photo will be displayed in campaign of government schemes. orders were issued to all departments by c.m.o. as per supreme court guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X