అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలను పులస ఫీవర్ పట్టుకుంది. ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే లభించే ఈ పులస చేప సీజన్ వచ్చేసింది. కేవలం జులై, ఆగస్టు మాసాల్లో లభించే ఈ అరుదైన చేప అంటే మాంస ప్రియులు లొట్టలేసుకుని తింటారు. మాంసాహారంలోనే ఈ పులస చేపలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.

అంతేకాదు మాంసాహారంలో చేపల పులుసుకు ప్రత్యేక స్థానముంటే చేపల పులుసులో ఈ పులస వంటకం ఎంతో ప్రత్యేకం. మన రాష్ట్రంలో కేవలం ఉభయ గోదావరి జిల్లాలో అరుదుగా లభించే ఈ సీజనల్ ఫిష్‌ను ఇప్పుడు రుచి చూసేందుకు రాష్ట్రంలోని మాంసాహారులు ఆయా జిల్లాకు బారులు తీరుతున్నారు.

గోదావరిలో నిగనిగలాడే వెండి చేప వలకు దొరికితే నిధి దొరికినట్లేనని మత్స్యకారులు భావిస్తారు. పులస చేపను పట్టడం ఒక అన్వేషణగా భావిస్తారు. వరద రూపంలో సముద్రం నుంచి గోదావరి నదిలోకి రాగానే ఇది ఇలసగా మారుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజీనియా నుంచి ఈ పులస చేప వలస వచ్చింది.

ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ జాతీయ ఫిష్‌గా ఈ పులస చేప ఉంది. పులస చేప ప్రత్యేక ఏంటంటే గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి ఎదురీదుతుంది. గుడ్లు పెట్టిన అనంతరం అక్టోబర్లో తిరిగి వెళ్లిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజి దిగువున మాత్రమే ఈ పులస చేపలు దొరుకుతాయి. గోదావరి తీపి నీటితో పులస రంగు రుచి మారిపోతుంది.

వలలో పడిన అనంతరం చనిపోయినా రెండు రోజులు తాజాగా ఉంటుంది. పులస చేపల్లో పోతుపులస, శనపులస అని రెండు రకాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆడ పులస ధర, రుచీ రెండూ ఎక్కువగా ఉంటాయి. 1469 కిలోమీటర్లు ఉన్న గోదావరిలో ఇవి లభ్యమవుతాయి. పులస చేప జాతి అరుదైన జాతి.

 ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

వీటని కృత్రమంగా సాగు చేయలేం. అందుకే దీని ధర అంత ఎక్కువగా ఉంటుంది. పులస చేపలు వెండి రంగులో తళతళలాడుతుంటాయి. పులస చేపలను రుచిగా వంటడం కూడా ఓ కళ. ఒకరోజు వండి నిల్వ ఉంచి తింటే ఇంకా మజాగా ఉంటుంది. పులస చేప మార్కెట్‌లో ఇంత ధర ఉంటుందని చెప్పడం కష్టం.

ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

ప్రతి ఏటా ధర మారుతూ ఉంటుంది. మెలైన పులస చేపలను పట్టడానికి ఎంతో సహనం కావాలి. ఈ ఏడాది గోదావరి నదికి భారీగా వరద నీరు చేరడంతో ఇదే అదనుగా భావించి మత్స్యకారులు సైతం పులస చేపల ధరలను అమాంతం పెంచేశారు. రెండేళ్ల క్రితం వరకు కిలో పులస ధర రూ. వెయ్యి కంటే తక్కువగా ఉంటే ఈ ఏడాది అదే రేటు రూ. 2 వేల నుంచి రూ. 8 వేలకు చేరింది.

 ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

అరుదుగా లభించే ఈ పులస చేపలకు కిలోకు రూ.4 వేలు పెట్టేందుకు సిద్ధమైనా అవి దొరక్కపోవడంతో మాంసాహారులు తెగ బాధపడిపోతున్నారు. ఈ ఏడాది గోదావరి వరద పెరగడంతో పులస చేపలు విపరీతంగా లభిస్తున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రముఖ హోటళ్లన్నీ పులస పులుసును ప్రత్యేక వంటకంగా అందిస్తున్నాయి.

ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

ఏపీలో పులస 'ఫీవర్': కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర

రేట్లు విపరీతంగా ఉన్నప్పటికీ, పులస చేపలకు మాత్రం ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. వచ్చే నెలాఖరు వరకు మాత్రమే లభించే ఈ పులసను ఒక్కసారైనా రుచి చూడాలన్న మాంసాహారుల జిహ్వాలాపనే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో పులస ఫీవర్‌పై పలు తెలుగు న్యూస్ ఛానెళ్లు ప్రత్యేక వార్తా కథనాలను కూడా ప్రసారం చేయడం విశేషం.

English summary
Scientific name is Ilish also spelled Elish, is a popular fish to eat among the people of Andhra Pradesh, Bengal and Orissa. It is also the national fish of Bangladesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X