అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీని ఆదుకోవాలి: ఆర్థికమంత్రుల సదస్సులో బాబు, తెలంగాణ దూరం

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌(టీవోఆర్)ను వ్యతిరేకించే రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు సోమవారం వెలగడపూడి సచివాలయంలో ప్రారంభమైంది.

మొదటి దశ సమావేశం ఏప్రిల్10న కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఇప్పుడు రెండో సమావేశాన్ని అమరావతిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటి సమావేశంతోపాటు ఈ సమావేశానికి కూడా తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో తాము పాల్గొనడం లేదని మంత్రి ఈటెల ఇంతకుముందు చెప్పారు.

Only six states to attend finance ministers’ meet, Telangana may keep away

కాగా, సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. విభజన కారణంగా ఏపీ రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోందని అన్నారు. హేతుబద్ధత లేని విభజనతో నష్టపోయామని అన్నారు. ఏపీతోపాటు రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు.

పేదరిక నిర్మూలన కోసం కొత్త విధానాలు తీసుకొస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉన్నట్టుండి జనాభాను కట్టడి చేయడం కష్టమని అన్నారు. కేరళ రాష్ట్రం జనాభా నియంత్రణలో ముందుందని అన్నారు. అందరి లక్ష్యం పేదరిక నిర్మూలనే ఉండాలని చెప్పారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు మారాల్సిందేనని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఇబ్బందులు కలిగేలా 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఉండాలని అన్నారు. ఎక్సౌజ్, కమర్షియల్ టాక్స్‌లే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయమని, కానీ, వాటిని భర్తీ చేసేందుకు కేంద్రం అంగీకరించడం లేదని అన్నారు.

ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్డుడు మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య భవిష్యత్‌లో పదికి చేరుతుందని అన్నారు.
ఎఫ్ఆర్బీఎంను 1.7శాతానికి కుదించాలని కేంద్రం చూస్తోందని యనమల అన్నారు.
15వ ఆర్థిక సంఘం టీవోఆర్ ప్రకారం రాష్ట్రాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నాయని మంత్రి ధ్వజమెత్తారు.

English summary
The much-hyped second conclave of finance ministers scheduled for Monday in Amaravati has lost its sheen with the Centre allegedly putting a spanner in the wheels. Only six states, including host Andhra Pradesh, are participating in the event. Telangana has not confirmed its participation. Punjab, Puducherry, Delhi, Kerala, and West Bengal — all non-BJP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X