• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిన్నారుల ఆశలు చిగురింపజేస్తున్న ఆపరేషన్ ముస్కాన్.!వీధి బాలల బంగారు భవితకు బాటలు వేస్తున్న ఏపి సర్కార్.!

|

అమరావతి/హైదరాబాద్ : వీధి బాలల సంరక్షణ, వారి బంగారు భవితకు ఏపి ప్రభుత్వం రూపొందించి బృహత్కర కార్యాచరణ ఆపరేషన్ ముస్కాన్ సత్ఫలితాలనిస్తున్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఆధరణకు నోచుకోలేని ఎంతో మంది చిన్నారులకు ఈ ఆపరేషన్ ముస్కాన్ వరంలా పరిణమించినట్టు చర్చ జరుగుతోంది. దిక్కుమొక్కు లేని చిన్నారులను చేరదీసి వారికి విద్యబుద్దులు చెప్పిస్తూ ప్రయోజకులను చేయడమే లక్ష్యంగా ఏపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్యక్రమానికి ఊహించని స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.

 ఏపి ప్రభుత్వం వినూత్న కార్యక్రమం.. మంచి ఫలితాలిస్తున్న ఆపరేషన్ ముస్కాన్.

ఏపి ప్రభుత్వం వినూత్న కార్యక్రమం.. మంచి ఫలితాలిస్తున్న ఆపరేషన్ ముస్కాన్.

ఏపి వ్యాప్తంగా ఎలాంటి ఆధరణ లేని అనాథలకు బంగారు భవిత ప్రసాదించేందుకు ఏపి ప్రభుత్వం నడుం బిగించింది. కుటుంబ కారణాలతో చదువుకు దూరమై చిన్ని చితకా పనులు చేసుకుంటున్న బాలలు, కుటుంబ ఆధరణ కరువై తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అభయహస్తం అందిస్తోంది ఏపి ప్రభుత్వం. చదువుకోవాలనే తపన ఉన్నప్పటికి పరిస్ధితులు సహకరించ పనివాళ్లుగా మిగిలిపోతున్న చిన్నారులను చేరదీసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ ముస్కాన్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది.

 అనాథ,వీది బాలలకు రిలీఫ్.. ప్రయోజకులను చేసేందుకు సిద్దం అంటున్న ఏపీ సర్కార్..

అనాథ,వీది బాలలకు రిలీఫ్.. ప్రయోజకులను చేసేందుకు సిద్దం అంటున్న ఏపీ సర్కార్..

ఆపరేషన్ ముస్కాన్ రెండవ రోజులో భాగంగా గురువారం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, పోలీసు అధికారులతో కలిసి వీధి బాలలను గుర్తించడానికి ప్రత్యక్షంగా కదం కదిపారు. అందులో ఆర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్ నందు ముగ్గురు బాలురను గుర్తించి వారితో మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా వీధి బాలలను గుర్తించేందుకు మచిలీపట్నంలోని మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న కూరగాయాల మార్కెట్ కి వెళ్లగా అక్కడ కొత్తిమీర అమ్ముతూ, గుమ్మడికాయల అమ్ముతూ, పేపర్ వేస్తూ ముగ్గురు బాలలు ఎస్పీకి కనిపించారు.

 రెండవరోజు ఆపరేషన్ లో భాగంగా పట్టుబడ్డ ముగ్గురు బాలలు.. సంరక్షిస్తామంటున్న పోలీసులు..

రెండవరోజు ఆపరేషన్ లో భాగంగా పట్టుబడ్డ ముగ్గురు బాలలు.. సంరక్షిస్తామంటున్న పోలీసులు..

ఇక వారితో మాట్లాడుతూ ఏ విధంగా వారిని ఇంట్లో వారు పనికి పంపుతున్నారని ఎస్పీ ప్రశ్నించారు. వీధి బాలలను ప్రశ్నించిన జిల్లా ఎస్పీ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న ప్పటికీ ముక్కుపచ్చలారని చిన్నారులను ఈవిధంగా బయటకు పనులకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆ ముగ్గురు బాలురకు తల్లిదండ్రులు ఉన్నారా లేకుంటే ఎవరి సంరక్షణ లో ఉన్నారు, ఎందుకు వారి పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా బయట వ్యాపారాలు చేసే ఎందుకు పంపుతున్నారని ఆరా తీసారు.ఇటువంటి ధోరణి ప్రదర్శిస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.

 నేటి బాలనే రేపటి దేశ భవిత.. ఫలితాలిస్తున్న ఆపరేషన్ ముస్కాన్..

నేటి బాలనే రేపటి దేశ భవిత.. ఫలితాలిస్తున్న ఆపరేషన్ ముస్కాన్..

ఇదిలా ఉండగా ముగ్గురు బాలురలో ఒకరికి తల్లిదండ్రులు లేకపోవడంతో ముసలివారైన అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండి ఇలా పేపర్ అమ్ముతుండడంతో, అతనితో మాట్లాడి, చదువుకుంటావా అని అడిగారు ఎసి. చదువు కుంటానని బాలుడు స్పష్టం చేయడంతో, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ధర్మేంద్ర, మచిలీపట్నం డిఎస్పీ రమేష్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర కుమార్ గారు, ఆర్ పేట ఇన్స్పెక్టర్ భీమరాజు గారు, చిలకలపూడి ఇన్స్పెక్టర్ అంకబాబు తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల సహకారంతో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముందుకు వెళ్తుందనే చర్చ జరుగుతోంది.

English summary
Operation Muskan seems to be reaping the benefits of the massive action plan designed by the AP government for the care of street children and their golden future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X