వర్మ ఇంటికి పవన్ - తాజా ప్రతిపాదనలు, కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం నెక్స్ట్ లెవల్ కు చేరింది. పిఠాపురం తాజా ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో అడుగు పెట్టారు. పార్టీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. నేరుగా టీడీపీ నేత వర్మ నివాసానికి చేరుకున్నారు. వర్మ అతిధ్యం స్వీకరించారు. నియోజకవర్గంలో తాజా పరిస్థితుల పైన చర్చించారు. వైసీపీ రాజకీయ వ్యూహాల పైన మంతనాలు చేసారు. ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పిఠాపురంలో పవన్
పిఠాపురంలో పవన్ అడుగు పెట్టారు. వారాహి సిద్దమైంది. గొల్లప్రోలు చేరుకున్న పవన్ కు జిల్లాకు చెందిన జనసేన నేతలు తమ అధినేతకు స్వాగతం పలికారు. పిఠాపురంలో వర్మ పాత్ర కీలకంగా మారనుంది. దీంతో, పవన్ నియోవకర్గంలో అడుగు పెట్టిన వెంటనే ముందుగా దొంతమూరులో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ నివాసానికి వెళ్లారు. అక్కడ వర్మతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించిన తరువాత టీడీపీ నేత వర్మ మద్దతు దారులు నిరసనకు దిగారు. వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని నినదించారు. తరువాత చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడటంతో పవన్ కు మద్దతిచ్చేందుకు సిద్దమయ్యారు. పవన్ గెలుపుకు సహకరిస్తానని ప్రకటించారు.

వర్మతో కీలక మంత్రాంగం
ఈ సారి పిఠాపురం నుంచి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ లక్ష్యం. దీంతో..వర్మ మద్దతు కీలకంగా మారుతోంది. ఈ సమయంలోనే నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితుల పైన వర్మతో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. స్థానికంగా పరిష్కారం కాని అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం చేబ్రోలు రామాలయం సెంటర్ లో జరిగే బహింరగ సభలో ప్రస్తావించాల్సిన అంశాల పైన వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. పిఠాపురం పురుహుతికాదేవి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలతో ఎన్నికల ప్రచార యాత్రం ప్రారంభిస్తున్నారు.అటు వైసీపీ పిఠాపురం నుంచి వంగా గీతకు మద్దతుగా జనసేన నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. కీలక నేతలకు అక్కడ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పిఠాపురం పరిధిలోని పలువురితో మంత్రాంగం ప్రారంభించారు.

ఏం చెప్పబోతున్నారు
మూడు రోజుల పాటు పవన్ పిఠాపురంలోనే మకాం వేయనున్నారు. పవన్ కల్యాణ్ తొల విడత ప్రచార షెడ్యూల్ ఖరారైంది. తొలి విడత ప్రచార షెడ్యూల్ ను పార్టీ నేత మనోహర్ ప్రకటించారు. పవన్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పీ గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు. దీంతో, ఈ సాయంత్రం పిఠాపురంలో జరిగే బహింరగ సభలో పవన్ ఏం చెప్పబోతున్నారు...తన ఓటమి కోసం ప్రయత్నిస్తున్న ముద్రగడ గురించి ప్రస్తావన చేస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications