వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రభుత్వం చేసిన అప్పులెంత - టీడీపీ హయాంలో తెచ్చిందెంత : ఆర్బీఐ లెక్కలు ఇలా..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో చేసిన అప్పులెంత. టీడీపీ ఇచ్చి వెళ్లిన అప్పు మొత్తం ఎంత మేర ఉంది. కొంత కాలంగా ఏపీలో ఆర్దిక సంక్షోభం ఉందని.. రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతోందంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందంటూ ఆరోపించారు. ఈ ఆరోణలపైన అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ స్పందించారు. తన పాలనలో తీసుకొచ్చిన అప్పుల గురించి వివరించారు. ఇక, ఇప్పుడు ఆర్బీఐ అధికారికంగా రాష్ట్రాల అప్పుల లెక్కలను ప్రకటించింది. ఈ నివేదిక ద్వారా వాస్తవాలు బయటకు వచ్చాయి.

Opinion:RBI reveals the full statistics of AP debts in Jagans tenure and Chandrababus period

2022 మార్చి నెలాఖరుకు ఏపీ అప్పులు ఇలా..
ముఖ్యమంత్రి జగన్ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ఏపీ కి ఉన్న మొత్తం అప్పులు రూ 3,98,903 కోట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పగించి వెళ్లిన అప్పు మొత్తం రూ 2,70,421 కోట్లుగా ఉంది. దీని ద్వారా జగన్ హయాంలో ఏపీ చేసిన మొత్తం అప్పు రూ 1.28 లక్షల కోట్లుగా ఆర్బీఐ నిర్ధారించింది. దేశంలోనే మరో ఏడు రాష్ట్రాలు ఏపీ కంటే ఎక్కువ మొత్తంలో అప్పులు చేసాయి. 2019లో ఎన్నికల షెడ్యూల్ తరువాత కూడా నాటి టీడీపీ ప్రభుత్వం ఆరు వేల కోట్ల అప్పులు చేసింది. ఏపీ ప్రభుత్వం తాము చేస్తున్న ఖర్చులు..తీసుకొస్తున్న అప్పులు బడ్జెట్ లో స్పష్టంగా చూపిస్తున్నామని చెబుతోంది.

Opinion:RBI reveals the full statistics of AP debts in Jagans tenure and Chandrababus period

ఎక్కడ నుంచి ఎంత మేర అప్పు..
ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తెచ్చిన అప్పులను అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అందులో స్టేట్ డెవలప్ మెంట్ రుణం రూ 2, 63, 483 కోట్లుగా ఉంది. విద్యుత్ బాండ్ల ద్వారా రూ 8,256 కోట్లు సేకరించింది. ఇతర బాండ్ల ద్వారా రూ 1,500 కోట్ల సమీకరించినట్లు నివేదికలో స్పష్టం చేసారు. నేషనల్ సెక్యరిటీ ఫండ్ ద్వారా రూ 8,945 కోట్లు తెచ్చారు. ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ ద్వారా రూ 1,500 కోట్లు సమీకరించారు. బ్యాంకులు, నాబార్డు, ఇతర ఆర్దిక సంస్థల నుంచి రూ 6,799 కోట్లు సేకరించారు. దీంతో, మొత్తం అంతర్గత రుణం 2,90,483 కోట్లుగా నిర్దారించారు. కేంద్ర రుణాలు, అడ్వాన్సుల కింద 22,339 కోట్లు, ప్రొవిడెంట్ ఫఫండ్ కింద 20,917 కోట్లు, డిపాజిట్ అడ్వాన్సుల కింద 65,114 కోట్లు, కంటెన్ జెన్సీ ఫండ్ నుంచి 50 కోట్లు రుణాలుగా.. మొత్తంగా మూడు లక్షల 98 వేల 903 కోట్లు రాష్ట్ర అప్పుగా ఉంది.

Opinion:RBI reveals the full statistics of AP debts in Jagans tenure and Chandrababus period

ఇతర రాష్ట్రాల అప్పుల లెక్కలు..
ఏపీనీ భారీగా అప్పులతో శ్రీలంకగా మారుస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న వేళ ఆర్బీఐ నివేదిక కీలకంగా మారింది. ఏపీ కంటే ఏడు రాష్ట్రాలు పెద్ద మొత్తంలో అప్పులు చేసాయి. అందులో భాగంగా 2022, మార్చి 31 నాటికి రాష్ట్రాల అప్పుల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఆ నివేదక మేరకు తమిళనాడుకు 6,59869 కోట్లు అప్పు ఉంది. ఉత్తర ప్రదేశ్ కు 6,53,308 కోట్లు, మహారాష్ట్రకు 6,09000 కోట్లుగా నిర్దారించారు. పశ్చిమ బెంగాల్ కు 5,62,698 కోట్లు, రాజస్థాన్ కు 4,77,177 కోట్లు అప్పు ఉన్నట్లు గా నివేదిక స్పష్టం చేస్తోంది. రాజస్ఘాన్ కు 4,77, 177 కోట్లు ఉండగా, కర్ణాటకకు రూ 4,61,833 కోట్లు రుణం ఉన్నట్లుగా తేల్చారు. గుజరాత్ కు రూ 4,02,785 కోట్లు ఉండగా, ఆ తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రూ 3,98,903 కోట్లతో అప్పుల్లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తాము చేస్తున్న అప్పుల్లో ఎక్కవ మొత్తం పేదల సంక్షేమం..తద్వారా వారి నుంచి తిరిగి ఉత్పత్తి సామర్ధ్యం కోసం వినియోగించేలా వ్యవహరిస్తున్నామని చెబుతోంది.

English summary
RBI Reeals the states credit statistics of all the states including Andhra Pradesh, Now YCP leaders comparing state bebts in Jagans tenure and Chandrababus period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X