వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల్లో మెగా ఫ్యాన్స్ తేల్చిందేంటి : రీల్ లైఫ్‌లో ప‌వ‌న్‌తో..రియ‌ల్ లైఫ్‌లో జ‌గ‌న్‌తో..!

|
Google Oneindia TeluguNews

అంతన్నాడు.. ఇంతన్నాడు.. కానీ చివరికి పత్తా లేకుండా పోయాడు.. ఫ్యాన్ గాలి జోరుకు తట్టుకోలేకపోయాడు. కనీసం తను కూడా గెలవలేకపోయాడు. జగన్ సునామీలో గల్లంతయ్యారు. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ పాలిటిక్స్‌ను కరెక్టుగా అంచనా వేయలేకపోయాడు. ఫలితం బోర్లాపడ్డారు. పోటీ చేసిన రెండు చోట్లా ప్రజలు తిరస్కరించారు. ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంతకీ పవన్‌కు కలిసిరాని అంశాలు ఏమిటి..? ఇంత ఘోర వైఫల్యం చెందడానికి కారణాలేంటి..? కింగ్ మేకర్ అవుతానని ప్రచారం చేసుకున్న పవన్ అభిమానులకు ఆయన ఏమి సమాధానం చెబుతారు..?

 సిల్వర్ స్క్రీన్ పై షైన్ అయిన పవన్.. పొలిటికల్ స్క్రీన్‌పై పరిస్థితేంటి..?

సిల్వర్ స్క్రీన్ పై షైన్ అయిన పవన్.. పొలిటికల్ స్క్రీన్‌పై పరిస్థితేంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే. ఒక్క డైలాగు చెబితే చాలు థియేటరంతా ఈలలు గోలలు. అంత హార్ట్ బ్రేకింగ్ ఫ్యాన్స్‌కు గురువారం ఫలితాలతో నిజంగానే హార్ట్ బ్రేక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఓటమికి కారణాలు చాలా ఉన్నాయని పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మెగా బ్రదర్స్‌కు సొంత ఊరి ప్రజలే తిరస్కరించడం చర్చనీయాంశమైంది. 2009లో చిరంజీవి పాలకొల్లు తిరుపతి నుంచి పోటీచేశారు. ఆయన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ప్రజలు తిరస్కరించినప్పటికీ తిరుపతిలో మాత్రం ఆయన్ను అక్కున చేర్చుకున్నారు. ఇక పదేళ్లు తిరిగే సరికి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలోని భీమవరంలో పోటీ చేశారు. అక్కడ కూడా ప్రజలు పవన్‌ను తిరస్కరించారు. ఇక గాజువాకలో పవన్‌కు తన సొంత సామాజిక వర్గమే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సొంత సామాజిక వర్గం పవన్‌ను ఆదరించలేదా..?

సొంత సామాజిక వర్గం పవన్‌ను ఆదరించలేదా..?

పవన్ కళ్యాణ్‌ను తన సొంత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా దూరమయ్యారని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ. అక్కడ ఒక్క రాజోలు తప్పనిచ్చి మరెక్కడా జనసేనకు అనుకున్నంత స్థాయిలో ఓట్లు రాలేదు. ఇంకా చెప్పాలంటే కొందరు ఇతర సామాజిక వర్గానికి చెందిన పవన్ అభిమానులు కూడా జనసేనకు కాకుండా తమ సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ పవన్‌కు కలిసిరాలేదని అనలిస్టులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను సినిమా వరకే ఆయన్ను అభిమానించామని చెబుతున్న వారు... రాజకీయాలకు వచ్చేసరికి జగన్ వైపే నిలిచినట్లు చెబుతున్నారు. తన అభిమానులే తనకు అండగా నిలుస్తారని చెప్పిన పవన్‌కు వారినుంచి కూడా భంగపాటే మిగిలింది.

ఓటమిపై నోరువిప్పిన పవన్ : రాజకీయాల్లో కొనసాగడంపై కామెంట్ఓటమిపై నోరువిప్పిన పవన్ : రాజకీయాల్లో కొనసాగడంపై కామెంట్

 చంద్రబాబుతో జతకడుతారనే ప్రచారం కొంపముంచిందా..?

చంద్రబాబుతో జతకడుతారనే ప్రచారం కొంపముంచిందా..?

ఇక పవన్ కళ్యాణ్‌ కూడా ముందునుంచి కింగ్ మేకర్‌గా నిలుస్తారనే అభిప్రాయం చాలామందిలో కనిపించింది. అయితే ఒకవేళ హంగ్ పరిస్థితే వస్తే తను జగన్‌కు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వరని తిరిగి చంద్రబాబు వైపే మొగ్గు చూపుతారనే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో మళ్లీ చంద్రబాబు గద్దెనెక్కే అవకాశం ఉందని భావించిన ప్రజలు జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే ఒపీనియన్‌తో ఓటు వేసి ఉంటారనే అభిప్రాయాన్ని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పవన్ తన ప్రసంగాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తన మాటలు పాకిస్తాన్‌ వరకు వినపడాలని ఒక సభలో చెప్పడం, సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయని బీజేపీ వారు తనకు ముందే చెప్పారని చెప్పడం.. ఇలాంటివి ఆయనకు మైనస్‌గా మిగిలాయి. ఆ సమయంలో యువత పవన్ ప్రసంగాలకు జై కొట్టింది కానీ ఈవీఎంల దగ్గరకు వచ్చేసరికి జగన్‌కు జై కొట్టి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 మాయావతితో జతకట్టడం చాలా మందికి రుచించలేదా..?

మాయావతితో జతకట్టడం చాలా మందికి రుచించలేదా..?

ఇక పవన్ కళ్యాణ్ బీఎస్పీతో జట్టుకట్టడం తన సామాజికవర్గానికి రుచించకపోయి ఉండచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కమ్యూనిస్టులతో తప్ప ఎవరితో పొత్తు పెట్టుకోబోమని అంత స్పష్టంగా చెప్పిన జనసేనాని...తిరిగి మాయావతితో జట్టుకట్టడంపై చాలా మందికి పలు అనుమానాలు రేకెత్తాయి. అంతే కాదు జగన్ పై కేసులున్నాయి అవినీతిపరుడు అంటూ ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. అలాంటి కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్న మాయావతితో ఎలా చేతులు కలిపారనేది కూడా ఓటర్లను ఆలోచింపచేసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది కూడా జనసేన ఓటమికి కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

రెండు చోట్లా ప‌వ‌న్‌ను ఓడించిన వైసీపీ : శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్ట లేని జ‌న‌సేనాని : హ‌త‌విధీ..!రెండు చోట్లా ప‌వ‌న్‌ను ఓడించిన వైసీపీ : శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్ట లేని జ‌న‌సేనాని : హ‌త‌విధీ..!

వారసత్వ రాజకీయాలు వద్దన్న పవన్... నాగబాబును ఎలా నిలిపారు..?

వారసత్వ రాజకీయాలు వద్దన్న పవన్... నాగబాబును ఎలా నిలిపారు..?

పవన్ పోటీచేసిన నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం చేయకపోవడం, కుప్పంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోవడంతో ప్రజల్లో ఇద్దరూ ఒకటే అన్న సంకేతాలు వెళ్లాయని అనలిస్టులు చెబుతున్నారు. ఇది కూడా జనసేనకు పెద్ద దెబ్బ వేసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ మాటలు కూడా ప్రజలకు ఎక్కలేదనే అభిప్రాయం కూడా కలుగుతోంది. సీఎం కొడుకు సీఎం కావాలని ఉందా అని పవన్ ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలు తాను చేయనని చెప్పాడు. అంతలోనే తన సోదరుడు నాగబాబును ఎంపీ అభ్యర్థిగా నరసాపురం బరిలోకి దింపడం.... ఆయన కోసమే పవన్ భీమవరం ఎంచుకున్నారనే ప్రచారం జరగడం జనసేనానికి కోలుకోలేని దెబ్బ కొట్టిందనే వాదన వినిపిస్తోంది. కారణాలు ఏవైనా సరే జగన్ సునామీ స్పష్టంగా కనిపించిందని...చంద్రబాబు లాంటి అభ్యర్థే ఒకానొక సమయంలో వెనుకంజలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

మొత్తానికి మెగాఫ్యాన్స్ పవన్‌కు రీల్ లైఫ్ వరకే పరిమితమయ్యారని రియల్ లైఫ్‌లో జగన్‌కే జై కొట్టి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు రెండు గోదావరి జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం వైసీపీకే జై కొట్టినట్లు గురువారం ఫలితాలతో తేటతెల్లమైందని చెబుతున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా తానే గెలవకపోవడంతో ఇటు అభిమానుల్లో అటు కార్యకర్తల్లో నిరుత్సాహం కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.

English summary
Janasena Chief, Pawan Kalyan lost in two seats to YCP that he contested. This seems to be a major blow for Janasena as it contested for the first time. There were mixed opinions for the massive loss. Jansena is now retrospecting as what might have gone wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X