వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ టీడిపి లో యువ‌ర‌క్తం..! ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోనున్న‌ సీనియ‌ర్లు.!

|
Google Oneindia TeluguNews

ఆంద్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో యువ‌ర‌క్తం చోటుచేసుకోబోతోంది. ఇప్పుడున్న వ్రుద్ద నేద‌ల‌కు ఉద్వాస‌న ప‌లికి వారి స్థానంలో వారి కుటుంబ‌స‌భ్యుల‌కు అవ‌కాశాలు ఇచ్చే దిశ‌గా అదికార టీడిపి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. కాలంతో పాటు ప‌రుగెత్త‌లేని నాయ‌కుల‌కు విశ్రాంతినిచ్చి అదే స్థానంలో వారివారి అనుయాయుల‌కు అవ‌కాశం కల్పంచాల‌ని అదిష్టానం క్రుత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కె ఎర్ర‌న్నాయుడు వార‌సుడు కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు, చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కుమారుడు విజ‌య్ పాత్రుడుతో పాటు ప‌రిటాల ర‌వీంద్ర త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రాం రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వారేంటో నిరూపించుకుంటున్నారు. మిగిలిన నాయ‌కుల వార‌సుల‌ను కూడా రంగంలోకి దింపి లేలేత వ‌య‌సు పార్టీగా తెలుగుదేశాన్ని తీర్చి దిద్దాల‌ని చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌లు రిచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కి రంగంలోకి దిగబోతున్న‌ వార‌సులు ఎవ‌రు..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

ఏపి రాజ‌కీయాల్లో కొత్త త‌రం.! పాత త‌రం నేత‌ల‌కు బాబు ఉద్వాస‌న‌..!

ఏపి రాజ‌కీయాల్లో కొత్త త‌రం.! పాత త‌రం నేత‌ల‌కు బాబు ఉద్వాస‌న‌..!

ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీలోని సీనియర్ నేతలంతా పక్కకు తప్పుకుని యువతను రంగంలోకి దించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇందుకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఎమ్యెల్యేలుగా ఉన్న వారంతా తమ స్థానాల్లో తమ వారసులను పోటీలో దించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపధ్యంలోనే నియోజకవర్గ బాధ్యతలు కొడుకులకు అప్పగించి తాము పర్యవేక్షణ పాత్రకే పరిమితం అయ్యారని సమాచారం. అదే విషయాన్ని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారట. దీనికి చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారని తెలుస్తోంది.

చురుకైన పాత్ర పోషించ‌లేని నేత‌ల‌కు రాంరాం..! వారి బంధువుల‌కు అవ‌కాశం..!

చురుకైన పాత్ర పోషించ‌లేని నేత‌ల‌కు రాంరాం..! వారి బంధువుల‌కు అవ‌కాశం..!

నిజానికి రాష్ట్రంలో టీడీపీకి సానుకూల వాతావరణం కొంతవరకూ ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో 80 శాతం సంతృప్తి ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలోనే యువతకు ఛాన్స్ ఇస్తే వచ్చే 2024 కి వారంతా రాటుదేరుతారని నేతలు భావిస్తున్నారట. అందుకే సీనియర్ నేతల స్థానాల్లో వారి పిల్లల పొలిటికల్ లాంచింగ్ కు 2019 ఎన్నికలను ఎంచుకున్నారని సమాచారం ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తన బదులు తన కుమార్తె శిరీషకు అవకాశమివ్వాలని కోరారు. దీనికి అధిష్ఠానం సమ్మతించింది.

 వ‌యోభారం,అనారోగ్యంతో రాజ‌కీయాలు వ‌ద్దు..! కొత్త వారికి అవ‌కాశం ఇవ్వండంటున్న బాబు..!

వ‌యోభారం,అనారోగ్యంతో రాజ‌కీయాలు వ‌ద్దు..! కొత్త వారికి అవ‌కాశం ఇవ్వండంటున్న బాబు..!

అలాగే కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి ఈ సారి తాను పోటీచేస్తానో లేదో అని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అంటున్నారు. తాను పోటీ నుంచి వైదొలిగితే తన కుమారుడు శ్యామ్‌కు టికెట్‌ ఇవ్వాలని ఆయన పార్టీ అధినేతను కోరారని తెలుస్తోంది. దానికి సీఎం అంగీకరించారని సమాచారం. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి తాను ఎన్నికల్లో పోటీ చేయనని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. తన బదులు తన కుమారుడు అస్మిత్‌ రెడ్డి పోటీ చేస్తారని కూడా వెల్లడించారు. ఆయన ప్రకటన టీడీపీ రాష్ట్ర కార్యాలయ నాయకులకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన తన రిటైర్మెంట్‌ విషయాన్ని ఇంతవరకూ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

న‌వ‌భార‌త నిర్మాణం యువ‌త‌తోనే సాద్యం..!అందుకే వారికి స్వాగ‌తం..!

న‌వ‌భార‌త నిర్మాణం యువ‌త‌తోనే సాద్యం..!అందుకే వారికి స్వాగ‌తం..!

అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నుంచి ఈసారి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ టికెట్‌ను బొజ్జల కుమారుడు సుధీర్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ నాయుడు ఆశిస్తున్నారని సమాచారం. అయితే బొజ్జల పోటీ చేస్తేనే మంచిదని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరిలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఈసారి పోటీ చేయబోనని ఎప్పుడో చెప్పేశారు. మరి ఈ సీటు పై చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ టీడీపీ త్వరలో అంతా యూత్ మయం కానున్నదని తెలుస్తోంది.

English summary
Telugu desam party national president chandrababu naidu taken gigantic decision. in the next general elections he wants to skip ill healthy and most seniors leaders in ap. instead of skipping them babu wants to give opportunity to their sons and relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X