వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : ఏపిలో ప్ర‌భుత్వం ర‌ద్దు..!?? రాష్ట్రప‌తి పాల‌న‌లో ఎన్నిక‌లు..!??

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఏం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల వేళ ఓట్ల ర‌చ్చ ఎటు దారి తీస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏం డిమాండ్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఏపిలో ప్ర‌జ‌ల డేటా ప్ర‌యివేటు సంస్థ‌ల వ‌ద్ద‌కు చేరింద‌నే వార్త దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దాదా పుగా 7.82 ల‌క్ష‌ల ఓట్ల తొలిగింపుకు ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అవ‌న్నీ రాజ‌కీయంగా చేసిన ద‌ర‌ఖాస్తులు అయినా..ఎన్నిక ల సంఘం వీటి పై విచార‌ణ ప్రారంభించింది. ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి..

<strong>ఎమ్మెల్యే ఓటుకు ఎస‌రు : ఏపిలో 8.72 లక్ష‌ల ఫారం-7లు : ఎవ‌రికి న‌ష్టం క‌లిగేను..!</strong>ఎమ్మెల్యే ఓటుకు ఎస‌రు : ఏపిలో 8.72 లక్ష‌ల ఫారం-7లు : ఎవ‌రికి న‌ష్టం క‌లిగేను..!

ఎన్నిక‌ల వేళ గంద‌ర‌గోళం..

ఎన్నిక‌ల వేళ గంద‌ర‌గోళం..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం మ‌రో రెండు రోజుల్లో షెడ్యూల్ విడుద‌ల కానుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఏపి లో కొత్త ఆల జ‌డి మొద‌లైంది. ఎన్నిక‌ల‌కు కీల‌క‌మైన ఓట‌ర్ల లిస్టులో 54 ల‌క్ష‌ల దొంగ ఓట్లు చేర్చార‌ని విప‌క్ష నేత‌లు.. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు ఓట్ల తొలిగింపు కు ప్ర‌తిప‌క్షం కుట్ర చేస్తుందంటూ అధికార పార్టీ నేత‌లు ఆరోపించుకుంటున్నారు. దీంతో..ఎన్నిక‌ల సంఘం దీని పై సీరియ‌స్ గా దృష్టి సారించింది. విచార‌ణ లేకుండా ఏ ఒక్క‌రి ఓటు తొలిగించ‌మ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీ స్ప‌ష్టం చేసారు. అయితే, వీటి విచార‌ణ కోసం ఈ నెల‌7వ తేదీని డెడ్‌లైన్‌గా పెట్టారు. ఇంత పెద్ద మొత్తంలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించ‌టం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఇక‌, ఎమ్మెల్యే..మాజీ మంత్రి ఓట్లనే తొలిగించాలంటూ ద‌ర‌ఖాస్తులు వ‌స్తుండ‌టంతో ఇది ఎటువైపు దారి తీస్తుందో అనే టెన్ష‌న్ క‌నిపిస్తోంది.

ప్ర‌భుత్వ వ‌ద్దు..రాష్ట్రప‌తి పాల‌న లో ఎన్నిక‌లు..

ప్ర‌భుత్వ వ‌ద్దు..రాష్ట్రప‌తి పాల‌న లో ఎన్నిక‌లు..

ఏపిలో అధికార పార్టీ ప్ర‌జా స‌మాచారాన్ని దుర్వినియోగం చేస్తుంద‌ని..ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అక్ర‌మాల‌కు పాల్ప‌డు తోంద‌ని విప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు కోరుతున్నాయి. బిజెపి..వైసిపి నేత‌లు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి అధికార పార్టీ ఏర‌కంగా ఏపి ప్ర‌జ‌ల స‌మాచారాన్ని ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు అప్ప‌గించిందీ వివ‌రించ‌నున్నారు. అప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం కొన‌సాగితే ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింతగా అక్ర‌మాల‌కు పాల్పుడుతార‌నేది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌. దీంతో..ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ఏపి లో అప‌ధ్ద‌ర్మ ప్ర‌భుత్వం లేకుండా రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని..రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధం లేకుండా ఎన్నిక‌లను నిష్పాక్ష పాతంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ వైసిపి డిమాండ్ గా క‌నిపిస్తోంది. ఇదే విష‌యాన్ని వారు గ‌వ‌ర్న‌ర్ తో పాటుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఎన్నిక‌ల సంఘానిదే కీల‌క పాత్ర‌..

ఎన్నిక‌ల సంఘానిదే కీల‌క పాత్ర‌..

మ‌రో రెండు రోజుల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో..ఇప్పుడు ఇక ఎన్నిక‌ల సంఘం పాత్ర కీల‌కం కానుంది. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షం ఫిర్యాదు మేర‌కు ఏపి డిజిపిని ఎన్నిక‌ల విదుల నుండి త‌ప్పించేందుకు రంగం సిద్దం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇక‌, ప్ర‌తిప‌క్షాలు ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం వ‌ద్ద‌ని కోరుతున్నా దీని పై నిర్ణ‌యం మాత్రం గ‌వ‌ర్న‌ర్ సిఫార్సు మేర‌కు కేంద్ర క్యాబినెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే స‌మ‌యంలో ఏపిలో రాజ‌కీయంగా ప‌రిస్థితులు రోజురోజుకీ వేడి పుట్టిస్తున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్తితుల్లో ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వానికి అవ‌కాశం లేకుండా ఏపి లో రాష్ట్రప‌తి పాల‌న‌లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే..ఇది సైతం సెంటిమెంట్‌గా మారి..అధికార పార్టీ రాజ‌కీయంగా ఉప‌యో గించుకొనే అవ‌కాశం ఉందనేది విశ్లేష‌కుల అంచ‌నా.అయితే, మ‌రో రెండు రోజుల్లో షెడ్యూల్ వ‌చ్చిన త‌రువాత కేవ‌లం ప్ర‌భుత్వం పేరుకు మాత్ర‌మే ఆప‌ధ‌ర్మ ప్ర‌భుత్వంగా ఉంటుంద‌ని..ఎన్నిక‌ల సంఘ‌మే పూర్తిగా దృష్టి పెట్ట‌నుంది. దీం తో ...ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఏపిలో చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తి క‌రంగ మారాయి.

English summary
Political developments in AP before elections is becoming very sensitive. Opposition parties demanding president rule in AP to conduct free and fair elections. YCp and Bjp leaders requested governor to take action against AP govt on misusing the public sensitive data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X