హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ 'ఫోర్ డీ' ఫార్ములా: రోహిత్ ఆత్మహత్యపై వెంకయ్య, 'స్మృతి, దత్తాత్రేయ రిజైన్ చేయరు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ధ్వజమెత్తారు. కేరళలోని ఉప్పాలలో బిజెపి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయం చేరుకున్నారు.

ఈ సందర్భంగా విమానాశ్రయంలో హెచ్‌సీయూ పరిశోధన విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యపై మీడియాతో మాట్లాడారు. రోహిత్‌ రాసిన సూసైడ్ నోట్లో ఎవరి పేరునూ ప్రస్తావించలేదని, ఎవరి పైనా ఆరోపణ చేయలేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరమన్నారు.

ఇద్దరు కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీల రాజీనామాలకు డిమాండు చేస్తున్నాయని, గతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదా? అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంది కదా అని కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

ఇదంతా రాజకీయ లబ్ధికోసం కాకుండా ఎందుకన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే రోహిత్ ఆత్మహత్య పైన సంఘటనను సైతం రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుండగా విపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయన్నారు.

 Opposition has a 'Four D formula': Venkaiah Naidu

రోహిత్ ఆత్మహత్య పైన కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు 'ఫోర్ డి' ఫార్ములాకు తెరలేపాయని ఎద్దేవా చేశారు. తప్పుదోవ పట్టించడం, నిరోధించడం, మళ్లించడం, అంతరాయం.. అనే ఫార్ములాకు తెరలేపారని మండిపడ్డారు. విద్యార్థి మృతిపై రాజకీయం తగదన్నారు.

రోహిత్‌ ఆత్మహత్య బాధాకరమని, ఇలాంటి ఘటనలు జరగకూడదు. కులమతాల ప్రాతిపదికన ప్రభుత్వం ఎవ్వరిపైనా వివక్ష చూపదని, రోహిత్‌ బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులు వెలుగులోకి రావాలని కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా అన్నారు.

దళిత విద్యార్థి ఆత్మహత్యను అడ్డుపెట్టుకొని కులమతాల ప్రాతిపదికన సమాజంలో చీలిక తెచ్చేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారుని ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. మంత్రులెవరూ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.

రోహిత్ ఆత్మహత్యపై నివేదిక కోరిన సామాజిక న్యాయశాఖ

రోహిత్ ఆత్మహత్య ఘటన పైన నివేదిక సమర్పించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై తమ శాఖ కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు అధికారులు చెప్పారు.

English summary
Union Urban Development Minister M. Venkaiah Naidu on Wednesday said Congress and Communists raking up the University of Hyderabad research scholar’s suicide issue is the latest of their ‘Four D’ formula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X