వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుగ్గన‌కు హాట్సాఫ్...కంగ్రాట్స్‌: జ‌గ‌న్ త‌న చెట్టుని తానే న‌రుక్కుంటున్నారు: బాబు కీల‌క వ్యాఖ్య‌లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

కియా సంస్థ పై AP అసెంబ్లీ లో కీలక చర్చ || Chandrababu Congratulated Minister Buggana Rajendranath

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను ఉద్దేశించి సీఎం త‌న చెట్టుని తానే న‌రు క్కుంటున్నారంటూ చంద్ర‌బాబు విశ్లేషించారు. పోల‌వ‌రంలో రాజ్య‌స‌భ‌లో బీజీపీ నేత‌ల తీరు గురించి చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఇక‌, శాస‌న‌స‌భ‌లో ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాధ్ పైన స‌భ‌లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. అదే విధంగా చంద్ర‌బాబు స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారం పైనా..కియో సంస్థ సీఈఓ లేఖ పైనా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు..బుగ్గ‌న స‌మాధానం ఆస‌క్తి క‌రంగా మారాయి.

జ‌గ‌న్ త‌న చెట్టు న‌రుక్కుంటున్నారు..

జ‌గ‌న్ త‌న చెట్టు న‌రుక్కుంటున్నారు..

టీడీపీ అధినేత‌..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అసెంబ్లీ లాబీల్లో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. శాస‌న‌స‌భ జ‌రుగుతున్న తీరును అదే విధంగా రాజ్య‌స‌భ‌లో పోల‌వ‌రం అంశం మీద బీజీపీ స‌భ్యుల ప్ర‌శ్న‌ల పైనా చంద్ర‌బాబు స్పందించారు. కొత్త‌గా సీఎం అయిన జ‌గ‌న్ తన చెట్టుని తానే నరుక్కుంటున్నారని విమర్శించారు. తాము నిర్మాణాలు చేస్తే..ఇప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం కూల్చివేసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. అవ‌గాహ‌న లేని నిర్ణ‌యాల‌తో ముందుకు వెళ్తున్నారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల పైన చ‌ర్చ మొద‌లైంది. పోల‌వ‌రం విష‌యంలో సాయిరెడ్డి సీబీఐ విచార‌ణ అడిగితే..పోల‌వ‌రానికి ఎంత ఇస్తారంటూ అదే పార్టీలో కొత్త‌గా చేరిన ర‌మేష్ ప్ర‌శ్నించిన విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.వాళ్లల్లోనే వాళ్లకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదన్నారు. ఆర్అండ్ఆర్ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం.. వైసీపీ మాట్లాడటం లేదని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

బుగ్గ‌న‌కు హాట్సాఫ్‌..కంగ్రాట్స్..

బుగ్గ‌న‌కు హాట్సాఫ్‌..కంగ్రాట్స్..

శాస‌న‌స‌భ‌లో స‌దావ‌ర్తి భూముల గురించి చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేసారు. స‌దావ‌ర్తి అంశంపైన మాట్లాడిన చంద్ర‌బాబు తిర‌గి కియో సంస్థ ఏపీకి రావ‌టం పైనా స్పందించారు. కియో ప‌రిశ్ర‌మ వైయ‌స్ తెచ్చార‌ని రాజేంద్ర‌నాధ్ చెబుతున్నార‌ని..2007లో వైయ‌స్‌ను క‌లిస్తే వ‌చ్చింద‌ని మంత్రి అంటున్నార‌ని.. ప‌రిశ్ర‌మ వ‌చ్చింది 2017లో అని గుర్తు చేసారు. అంటే వైయ‌స్ ఆత్మ కియో సంస్థ సీఈవోకు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లి పెట్టుబ‌డి పెట్టు అని చెప్పారా అని ప్ర‌శ్నించారు. దీనికి బుగ్గ‌న తాను సీఈవో రాసిన లేఖ‌లోని అంశాల‌నే ప్ర‌స్తావించా న‌ని మ‌రోసారి లేఖ‌లోని అంశాల‌ను చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు స్పందిస్తూ బుగ్గ‌న తెల‌వితేట‌కు హాట్సాఫ్ అంటూనే మ‌న‌స్పూర్తిగా అభినంద‌న‌లు...కంగ్రాట్స్ చెప్పారు. దీనికి బుగ్గ‌న కూడా చంద్ర‌బాబు ఏ ఉద్దేశంతో త‌న‌ను తెలివి గ‌ల వాడు అని అన్నా..అభినందించందుకు ద‌న్య‌వాదాలు అని చెప్పారు.

ప‌ట్టిసీమ‌..స‌దావ‌ర్తి గురించి అలాగే చెబుతున్నారు..

ప‌ట్టిసీమ‌..స‌దావ‌ర్తి గురించి అలాగే చెబుతున్నారు..

చంద్ర‌బాబు వైసీపీ తీరును త‌ప్పు బ‌ట్టారు. ప‌ట్టిసీమ వ‌ల‌న కృష్ణా డెల్టాకు ఉప‌యోగం లేద‌ని చెప్ప‌టం వారిలోని అవ‌గాహ‌నను బ‌య‌ట పెడుతోంద‌న్నారు. గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్టు వైసీపీ మాట్లాడుతోందని పేర్కొన్నారు.స‌దావ‌ర్తి భూముల గురించి చంద్ర‌బాబు మాట్లాడారు. చెన్నైలో ఉన్న ఆ భూములు ఏపీ ప్ర‌భుత్వానివి అని చెప్పేందు కు ఎటువంటి ఆధారాలు లేవ‌ని..టైటిల్ డీడ్..ప‌ట్టా లేద‌ని చెప్పుకొచ్చారు. అటువంటి భూముల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ త‌మ‌వే అంటూ క్లెయిమ్ చేసుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని..దీని కార‌ణంగానే ఆక్ష‌న్ కు ముందుకు వ‌చ్చామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యే పార్ద‌సార‌ధి జోక్యం చేసుకుంటూ ఎటువంటి టైటిల్ డీడ్.. ప‌ట్టా ..ఆధారాలు లేని భూముల ను ప్ర‌భుత్వం ఆక్ష‌న్ వేసేందుకు ఎలా ముందుకు వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. దీంతో..దీని పైన విచారణ వేస్త‌న్న‌ట్లుగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ప్ర‌క‌టించారు.

English summary
Opposition leader Chandra babu interesting comments in AP Assembly. He congratulated Finance Minister Buggana Rajendra nath satierically on his statement on KIA CEO letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X