వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం జ‌రిగినా జ‌గ‌న్‌దే బాధ్య‌త‌: స్పీక‌ర్ సీటుకే ఆయ‌న అగౌర‌వం: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మరోసారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రితో పాటుగా స్పీక‌ర్ పైనా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. స‌భ‌లో త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌టం లేద‌ని.. ఇచ్చినా..అధికార ప‌క్షం సూచ‌న ల మేర‌కు తిరిగి క‌ట్ చేస్త‌న్నార‌ని ఆరోపించారు. ఇటువంటి శాస‌న‌స‌భ తానెప్పుడూ చూడ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఏపిలో రెండు నెల‌ల కాలంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపు త‌ప్పాయ‌ని వివ‌రించారు. ఎవ‌రికి ఏం జ‌రిగినా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాధ్య‌త వ‌హించాల్సిందేన‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసారు.

స్పీక‌ర్ పైన కీల‌క వ్యాఖ్య‌లు..
ఏపీ శాస‌న‌స‌భ జ‌రుగుతున్న తీర్పు మీద చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేసారు. ప్ర‌స్తుతం ఉన్న స్పీక‌ర్ ఆ సీటుకే గౌర‌వం పోయేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్ష నేత‌కు మైకు ఇవ్వ‌కుండా ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌ని ఆరోపించారు. తమ‌కు పొర‌పాటుగా మైకు ఇచ్చినా..అధికార పార్టీ నుండి వెంట‌నే సూచ‌న‌లు వ‌స్తాయ‌ని..ఆ మైకు క‌ట్ చేస్తార‌ని చెప్పుకొచ్చారు.

Opposition Leader Chandra Babu serious comments on CM Jagan and also on Speaker.

తాను న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ జీవితంలో శాస‌న‌స‌భ‌ను చూసాన‌ని..స్పీక‌ర్ల‌ను చూసాన ని వివ‌రించారు. స‌భ‌లో త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం లేక‌పోవ‌టంతో ఇలా ప్ర‌తీ రోజు మీడియా ముందుకు వ‌చ్చి స‌భ‌లో మాట్లాడాల్సిన అంశాల‌ను ఇలా వివ‌రించాల్సి వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రో రెండు రోజులు మాత్ర‌మే స‌మావేశాలు ఉన్నాయ‌ని..ఈ రెండు రోజులు స‌భ‌లోనే నిల‌దీయ‌టానికి ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. ఆ త‌రువాత ప్ర‌జ‌ల్లోనే అధికార పార్టీ ఏం చేస్తుంద‌నేదీ వివ‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసారు.

శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయి..
తాము అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఎక్క‌డా లాండ్ ఆర్డ‌ర్‌కు స‌మ‌స్య లేకుండా చూసామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొ చ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దౌర్జన్యాలు, దాడులు చేయడం, సమాజంలో అభద్రతాభావం తీసుకువచ్చా యని ఆరోపించారు. టీడీపీ నేతలపై వైసీపీ దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను కాపాడు కుంటామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలపై 285 దాడులు జరిగాయని, 65 ఆస్తులు ధ్వంసం చేశారని, 11 భూకజ్బాలు చేశారని, 24 చోట్ల కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని, ఏడు హత్యలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవ హరించకూడదని, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చంద్రబాబు అన్నారు. రాజకీయ నేతలకే కాదు సామాన్య ప్రజలకు కూడా పోలీసులు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

English summary
Opposition Leader Chandra Babu serious comments on CM Jagan and also on Speaker. Babu says law and orders totally out of control in AP. Govt encouraging Attacks on TDP cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X