వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ స్టార్ క్యాంపెయినర్లలో కాంగ్రెస్ డుమ్మా: రాహుల్ గాంధీ, ప్రియాంకలకు దక్కని స్థానం

|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నారు అభ్యర్థులు. పోటాపోటీగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షో లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్లతో నామినేషన్లతో ఎన్నికల ప్రక్రియలో ఓ కీలక అంకం ముగిసినట్టయింది. ఇక అభ్యర్థులు ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు.

టీడీపీ ప్రచారంలో ప్రతిపక్ష నేతలు..

టీడీపీ ప్రచారంలో ప్రతిపక్ష నేతలు..

తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా జాతీయస్థాయి నాయకులు రంగంలోకి దిగారు. కేంద్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లాను జమ్మూకాశ్మీర్ నుంచి రప్పించారు. మంగళవారం ఆయన కడపలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆయన ఒక్కరే కాదు.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్)తోపాటు మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ (జనతాదళ్-సెక్యులర్), డీఎంకే అధ్యక్షుడు ఎం కే స్టాలిన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ రాష్ట్రానికి రానున్నారు. వారితో పాటు కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి కూడా చంద్రబాబుకు మద్దతుగా ప్రచారానికి వస్తారని సమాచారం.

కాంగ్రెస్ కు చోటేదీ?

కాంగ్రెస్ కు చోటేదీ?

అక్కడి దాకా బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా 21 జాతీయ ప్రతిపక్ష పార్టీలు మన రాష్ట్రానికి ప్రచారానికి రానున్నప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం డుమ్మా కొడుతోంది. ఈ 21 జాతీయ ప్రతిపక్ష నాయకుల కూటమికి నాయకత్వం వహిస్తున్నది కాంగ్రెస్సే. పైగా- గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో కలిపేశారు. కాంగ్రెస్ ను ఎందుకు రాష్ట్రానికి ఆహ్వానించట్లేదనేది ఆసక్తికరం అంశం. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పిలిపించి, తనకు మద్దతుగా ప్రచారం చేయిస్తే.. ఓట్లు పడవా? అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

కాంగ్రెస్ చంద్రబాబుకు కొత్త చుట్టం కాదు..

కాంగ్రెస్ చంద్రబాబుకు కొత్త చుట్టం కాదు..

చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ కొత్త చుట్టమేమీ కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు వేదికను కూడా పంచుకున్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబులు ఒకే వేదికపై నుంచి ఎన్నికల బహిరంగ సభలను నిర్వహించారు. చెన్నైలో డీఎంకే నిర్వహించిన బహిరంగ సభకూ చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పాల్గొన్న ఆ సభలో.. కాంగ్రెస్ కు మద్దతుగా చంద్రబాబు ప్రసంగించారు. ఇదివరకు కోల్ కోతలో మమతా బెనర్జీ నిర్వహించిన యునైటెడ్ ర్యాలీలోనూ చంద్రబాబు పాల్గొన్నారు. ఇంతా చేసినప్పటికీ.. కాంగ్రెస్ ను పిలిపించాలంటే చంద్రబాబుకు జంకుతున్నారు. వెనకడుగు వేస్తున్నారు.

జాతీయ స్థాయిలో పొత్తులు..రాష్ట్రంలో శతృవులు!

జాతీయ స్థాయిలో పొత్తులు..రాష్ట్రంలో శతృవులు!

చంద్రబాబుకు మద్దతుగా జాతీయ పార్టీల నాయకులు వేర్వేరుగా నిర్వహించే ప్రచార సభలకు కాంగ్రెస్ ను ఆహ్వానించకపోవడం వెనుక గల కారణాలను మనం ఇట్టే ఊహించుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ భుజం, భుజం కలిపి నడుస్తోన్న చంద్రబాబు నాయుడు.. రాష్ట్రానికి వచ్చే సరికి ఆ పార్టీతో సిగపట్లు పడుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు చోటు చేసుకోలేదు. ఈ రెండు పార్టీలు శతృవులుగా మారాయి. కయ్యానికి కాలు దువ్వుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో- టీడీపీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఏపీ వైపునకు రావట్లేదు. సొంత పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో నాలుగేళ్ల పాటు కొనసాగి, తరువాత బయటికి వచ్చిన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా 21 పార్టీల జాతీయ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. బీజేపీయేతర రాజకీయ పార్టీల నాయకులు రెండు, మూడు రోజుల్లో మన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది.
ముస్లింల ఓటుబ్యాంకు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఫరూఖ్ అబ్దుల్లా ప్రచారం చేశారు. విద్యావంతులు అధకంగా ఉన్న ప్రాంతాల్లో అరవింద్ కేజ్రీవాల్ తో ప్రచారం చేయించబోతున్నారు. ఈ నెల 28న అరవింద్ కేజ్రీవాల్ విజయవాడలో టీడీపీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం. ఈ నెల 31న విశాఖపట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొనబోతున్నారని అంటున్నారు. ఏప్రిల్ 2న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ టీడీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడతో కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న అనంతపురం, కర్నూలు ప్రచారం నిర్వహించే అవకాశముంది. తమిళ ఓటర్లు ఎక్కువగా ఉన్న చిత్తూరు జిల్లాలో స్టాలిన్ ప్రచారం చేస్తారని సమాచారం.

English summary
National wide 21 Opposition Parties leaders likely to participate in Elections Campaign with support of Telugu Desam Party supremo Chandrababu Naidu in Andhra Pradesh. Mamatha Benerjee (TMC), HD Deve Gowda (JDS), Aravind Kejriwal (AAP) Farooq Abdulla (National Conference), Tejaswi Singh Yadav (RJD) likely to participate in Election campaign in Andhra Pradesh. The tentative schedule also released, party sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X