వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేటా చోరీ పై స్పందించిన ప్ర‌తిప‌క్షం..! టీడిపి డ్రామాగా కొట్టిపారేసిన బుగ్గ‌న‌..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : వ్యక్తిగత సమాచార గోప్యత రాజ్యాంగ హక్కని అవసరమైతే పుట్టస్వామి కేసు చదవండని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడిపి నేత‌ల‌కు సూచించారు. కుటుంబ సమాచారం తీసుకుపోయి ప్రయివేట్ సంస్థలకు ఇచ్చారని, బ్యాంక్, మెయిల్, పేటియం అంతా ఎలా లీక్ అవుతాయ‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి కోసం ఇవి అవసరమా అని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సంస్థలు యజమానుల చేతి కి సమాచారం చేరిందని, వారు ఓటర్లను టీడీపీ, వైసీపీ, న్యూట్రల్, లోకల్ లో లేని వాళ్ళు అని నాలుగు గ్రూపులుగా చేశారని ఆరోపించారు. ఇది ఎన్నికల సంఘానికి తెలియకుండా చేశారని రాజేంద్రనాథ్‌రెడ్డి ఘాటుగా విమ‌ర్శించారు.

Opposition party reacted on Deta thefting..! says its a TDP Drama..!!

ఐటీగ్రిడ్స్‌ స్కాంపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్కాంలో ఏపీ ప్రభుత్వం తప్పు చేయకుంటే విచారణకు సిధ్దపడాలి. ఏం జరిగింది? బాధ్యులెవరు అనేది బయటకు రావాలి. టీడీపీ అంటే తెలుగుప్రజల సమాచారం దొంగిలించే పార్టీగా మారింది. వారికి ఇష్టం లేని ఓట్లను తొలగించేందుకు ఏకంగా టీడీపీ ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. సేవామిత్ర యాప్ లోకి కలర్ ఫోటోలు ఎలా వెళ్లాయి. టీడీపీ కార్యకర్తలకు సైతం వారి బ్యాంక్ వ్యవహారాలు అన్ని వారికి తెలిసిపోతున్నాయి. సత్య నారాయణ అనే వ్యక్తి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారిని తీసుకువచ్చి ప్రభుత్వం సలహాదారుడిగా ఉపయోగించుకుంటోంది. ఐటి గ్రిడ్ కుంభకోణంపై ఆధార్ సంస్ధ, ఎన్నికల కమీషన్, సైబర్ క్రైమ్ పోలీసు విచారణలు జరపాల్సిందేని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేసారు.

English summary
Ycp mla buggana Rajendranath reddy was angry how the bank, mail, and pettiness would be leaked. They questioned whether they needed for progress. IT grid and Blue Frog have claimed that the information has been handed over to the owners, who alleged that they were divided voters in four groups called TDP, YCP, Neutral and Local. Rajendra Nathreddy was criticized as not knowing the electoral community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X