వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు కుటుంబాల్లో వెలుగు నింపిన ‘సూర్య’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆ కుటుంబం తన పెద్ద మనుసును చాటుకుంది. చెట్టంత కొడుకును కోల్పోయామనే బాధను దిగమింగుకుని మరో ఆరు కుటుంబాల్లో వెలుగునింపింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా గార మండలం శిలగాం సమీపంలో ఉంటున్న ఆలపాటి సత్యన్నారాయణ, రాధవేణి దంపతుల కుమారుడు సూర్యనారాయణ(27) ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్నారు.

శనివారం రాత్రి సూర్యనారాయణ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడ్ని విశాఖలోని కేర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు సూర్యనారాయణ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. కొడుకు మరణంతో విషాదంలో మునిగిపోయిన అతని తల్లిదండ్రులకు జీవన్‌దాన్‌ కో-ఆర్డినేటర్‌ ఇందిర అవయవదాన ఆవశ్యకతను వివరించి, అవయవదానానికి ఒప్పించారు. దీంతో సూర్యనారాయణ కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు సేకరించారు.

సేకరించిన కిడ్నీల్లో ఒకదానిని సోమవారం విశాఖ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి, మరొక కిడ్నీని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చారు. కాలేయాన్ని నగరంలోనే చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి, ఊపిరితిత్తులను చెన్నైలోని గ్లోబల్‌ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వ్యక్తికి అమర్చారు.

రెండు కళ్లను ఐ బ్యాంకు ప్రతినిధులు సేకరించి తీసుకువెళ్లారు. వీటిని ఇద్దరు వ్యక్తులకు అమర్చనున్నట్లు ఐ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. కాగా, తన అవయవాల దానంతో సూర్యనారాయణ ఆరుకుటుంబాల్లో వెలుగు నింపిన వాడయ్యాడు.

సూర్యనారాయణ

సూర్యనారాయణ

ఆ కుటుంబం తన పెద్ద మనుసును చాటుకుంది. చెట్టంత కొడుకును కోల్పోయామనే బాధను దిగమింగుకుని మరో ఆరు కుటుంబాల్లో వెలుగునింపింది.

సూర్యనారాయణ

సూర్యనారాయణ

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా గార మండలం శిలగాం సమీపంలో ఉంటున్న ఆలపాటి సత్యన్నారాయణ, రాధవేణి దంపతుల కుమారుడు సూర్యనారాయణ(27) ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్నారు.

సూర్యనారాయణ

సూర్యనారాయణ

నివారం రాత్రి సూర్యనారాయణ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడ్ని విశాఖలోని కేర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు సూర్యనారాయణ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు.

సూర్యనారాయణ

సూర్యనారాయణ

కొడుకు మరణంతో విషాదంలో మునిగిపోయిన అతని తల్లిదండ్రులకు జీవన్‌దాన్‌ కో-ఆర్డినేటర్‌ ఇందిర అవయవదాన ఆవశ్యకతను వివరించి, అవయవదానానికి ఒప్పించారు. దీంతో సూర్యనారాయణ కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు సేకరించారు.

సూర్యనారాయణ

సూర్యనారాయణ

సేకరించిన కిడ్నీల్లో ఒకదానిని సోమవారం విశాఖ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి, మరొక కిడ్నీని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చారు.

సూర్యనారాయణ

సూర్యనారాయణ

కాలేయాన్ని నగరంలోనే చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి, ఊపిరితిత్తులను చెన్నైలోని గ్లోబల్‌ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వ్యక్తికి అమర్చారు.

English summary
In what is the first case of cadaver organ donation and transplantation under the Andhra Pradesh Jeevandan scheme after it was bifurcated from the NIMS office in Hyderabad, Telangana, four organs retrieved from a 27-year-old brain dead road accident victim were transplanted in needy patients in Visakhapatnam and Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X