వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ వైచిత్రి:ఆ నేతలు వైసీపీకి పనికి రావడం లేదు...కానీ ఇతర పార్టీలు నెత్తిన పెట్టుకుంటున్నాయి

|
Google Oneindia TeluguNews

కాకినాడ:ఎన్నికలు సమీపించేకొద్దీ వైసిపిలో వలసలు పెరిగిపోతున్నాయి...ఇటీవలి కాలంలో తూర్పు గోదావరి జిల్లా నేతల నుంచే వరుసగా జగన్ కు గట్టి షాక్ లు తగులుతున్నాయి. అది కూడా జగన్ ఆ జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసిన తరువాతే ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండటం గమనార్హం.

ఇప్పటికే జిల్లాలో స్థానికంగా పట్టున్న పలువురు నేతలు వైకాపాకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అలా వైసిపిని వీడిన ముమ్మడివరం నేత పితాని బాలకృష్ణ ఏకంగా జనసేన తొలి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని కలకలం సృష్టించారు. తాజాగా ఇదే కోవలో మరో ప్రముఖ నేత చలమలశెట్టి సునీల్ వైసిపికి గుడ్ బై చెప్పేందుకు సిద్దం కాగా ఆయనకు కూడా అధికార పార్టీ నుంచి బంపర్ ఆఫర్ లభించిందని...కాకినాడ టిడిపి ఎంపి టికెట్ ఆయనకే కన్ ఫర్మ్ చేశారని అంటున్నారు.

ఇప్పటికే...ఈ నేతలు జంప్

ఇప్పటికే...ఈ నేతలు జంప్


తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇటీవలికాలంలో వైసిపిని వీడిన ముఖ్యనేతల జాబితా లో కాకినాడకు చెందిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి నిర్వహించిన సంగిశెట్టి అశోక్‌, ముమ్మిడివరం నేత పితాని బాలకృష్ణ, రాజమహేంద్రవరం నుంచి కందుల దుర్గేష్‌ తదితరులు వైసీపీ నుంచి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో పితాని బాలకృష్ణ ఏకంగా జనసేన నుంచి తొలి ఎమ్మెల్యే టికెట్ పొందిన సంచలనం సృష్టించారు.

తాజాగా...మరో తూ.గో నేత గుడ్ బై

తాజాగా...మరో తూ.గో నేత గుడ్ బై

తాజాగా వైసిపి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ చలమలశెట్టి సునీల్‌ టీడీపీలో చేరేందుకు సంసిద్దులయ్యారు. ముందు నుంచీ వైసీపీలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన చలమలశెట్టి సునీల్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీలో దుమారం రేపుతోంది. గతకొంతకాలంగా వైకాపా అధినేత జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంటూ ఆ పార్టీలో ఇమడలేక సతమతమవుతున్న చలమలశెట్టి సునీల్ ఎట్టకేలకు వైసిపి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. మూడు నెలల కిందటే తన సామాజిక వర్గీయులతో సమావేశమై భవిష్యత్‌ నిర్ణయంపై సమాలోచనలు చేసిన చలమలశెట్టి సునీల్ అప్పుడే వైసీపీకి గుడ్‌బై చెప్తారని భావించినా జగన్ వారించడంతో అప్పటికి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

కాకినాడ ఎంపి...సీటు ఈయనకేనా?....

కాకినాడ ఎంపి...సీటు ఈయనకేనా?....

మూడు నెలల కిందటే తన సామాజిక వర్గీయులతో సమావేశమై భవిష్యత్‌ నిర్ణయంపై సమాలోచనలు చేసిన చలమలశెట్టి సునీల్ అప్పుడే వైసీపీకి గుడ్‌బై చెప్తారని భావించినా జగన్ వారించడంతో అప్పటికి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మరోవైపు కాకినాడ పరిథిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చలమలశెట్టి సునీల్ పై టిడిపి కన్నేసింది. వైసిపిలో తాజా పరిణామాలతో తనకు ప్రాధాన్యం తగ్గిందని...ఆర్ధికబలంలేకపోతే వైసీపీలో టికెట్‌ రాదని, ఎంత కమిట్‌మెంట్‌తో పనిచేసినా పక్కనపెడతారని డిసైడ్ అయిన చలమలశెట్టి సునీల్ టిడిపి ఏకంగా కాకినాడ ఎంపి సీటు ఆఫర్ తోనే తమ పార్టీలోకి ఆహ్వానం పలికినట్లు తెలిసింది. దీంతో ఇక సునీల్ టిడిపిలో చేరిక ఇక లాంఛనమేనంటున్నారు.

ఆ మాజీ మంత్రి కూడా...వస్తారట!

ఆ మాజీ మంత్రి కూడా...వస్తారట!

జిల్లాలో వైసిపి అగ్రనేతలంతా వలసల బాట పడుతుండటంతో ఈ ప్రభావం ఆ పార్టీ మిగతా నేతలపై చాలా తీవ్రంగా పడిందంటున్నారు టిడిపి నేతలు. ఇదే బాటలో కోనసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ నుంచి తమ పార్టీలో చేరేందుకు చాలా ఆసక్తితో ఉన్నారని, అయితే సదరు నేతతో ఈ విషయంమై సన్నిహితంగా చర్చలు జరిపేందుకు సరైన మధ్యవర్తి కన్పించక ఆలస్యమవుతోందని టిడిపి నేతలు అంటున్నారు. ఆ నేత పైకి తాను వైసిపి వీడనని అంటున్నా సంతృప్తికరమైన హామీ ఇస్తే టిడిపిలోకి రావడం ఖాయమని తెదేపా నేతలు ధీమ వ్యక్తం చేస్తున్నారు.

అదే బాటలో...మరికొందరు నేతలు

అదే బాటలో...మరికొందరు నేతలు

అలాగే రాజోలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, కోనసీమలో బీసీలలో బలమైన నేతగా ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే, మండపేటలో టికెట్ దక్కని నేత ఇలా వీరందరూ తమ పార్టీ వైపే చూస్తున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. వీరితో పాటు తమకు టికెట్ రాదని ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ పార్టీని వెంటనే వీడేందుకు పలువురు వైసిపి నేతలు సిద్దంగా ఉన్నారని టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. పైగా వైసిపిని వీడిన నేతలకు వారిని చేర్చుకుంటున్న పార్టీలు అగ్రతాంబూలం ఇస్తుడంటం ఆ పార్టీ ఇతర అసంతృప్తి నేతలను మరింత పురికొల్పే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

English summary
East Godavari:Kakinada prominent YCP leader Chalamalasetti Sunil seems to have been ready to say goodbye to the party. The sources said that he has received a bumper offer from the ruling party TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X