వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలకు ఊరట: టిడిపిలోకి 'రెడ్డి' నాయకులు!, దూసుకెళ్తున్న బ్రహ్మానంద రెడ్డి

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఊరట. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల/అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఊరట. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.

పవన్ కళ్యాణ్‌పై తేల్చేసిన అఖిల, శిల్పాపై తీవ్రవ్యాఖ్యలు, ఆమెవల్లేనని చక్రపాణి రెడ్డి పవన్ కళ్యాణ్‌పై తేల్చేసిన అఖిల, శిల్పాపై తీవ్రవ్యాఖ్యలు, ఆమెవల్లేనని చక్రపాణి రెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. చేరిన వారిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

వీరు సహా 40 మంది

వీరు సహా 40 మంది

గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామానికి చెందిన ఇసుకపల్లి మహేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వర్దన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాంరెడ్డి, వేమారెడ్డి, వెంకట రెడ్డిలతో పాటు మరో 40 మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

Recommended Video

Nandyal By-Poll : A Big War Between Akhila Priya And Silpa Mohan Reddy
పార్టీ కండువా కప్పిన చంద్రబాబు

పార్టీ కండువా కప్పిన చంద్రబాబు

ఈ సందర్భంగా వీరికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శిరివెళ్ల మండలం టిడిపి కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కామినేనిపల్లి సర్పంచి రాంభూపాల్ రెడ్డి, సుధారామ ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

అందుకే టిడిపిలోకి

అందుకే టిడిపిలోకి

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం చేస్తున్న కృషిని చూసే టిడిపిలోచేరుతున్నామన్నారు.

బ్రహ్మానంద రెడ్డి ఆశీర్వాద యాత్ర

బ్రహ్మానంద రెడ్డి ఆశీర్వాద యాత్ర

కాగా, నంద్యాల ఉప ఎన్నిక టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఆశీర్వాదయాత్ర పేరుతో సైకిల్‌, పాదయాత్రగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తొలిసారి ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. కొన్నింటిని ఇప్పటికే పరిష్కరించారు. బుధవారం ఆయన నామినేషన్‌ వేయనున్నారు. భూమా బ్రహ్మానంద రెడ్డి భూమా శేఖర్ రెడ్డి తనయుడు.

ఇదీ భూమా బ్రహ్మానంద రెడ్డి

ఇదీ భూమా బ్రహ్మానంద రెడ్డి

భూమా బ్రహ్మానంద రెడ్డి 1984, ఏప్రిల్‌ 4న రాయచోటిలో జన్మించారు. ప్రాథమిక విద్యను చెన్నైలో పూర్తి చేశారు. ఇంటర్‌, బీటెక్‌(2009) హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఇంటర్‌ చదువుతున్న రోజుల నుంచే జరుగుతున్న ఎన్నికల్లో చిన్నాన్న భూమా నాగిరెడ్డి, చిన్నమ్మ శోభానాగి రెడ్డిల తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2009, 2014 ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉమ్మడి కుటుంబంలోనే ఉంటూ 2013 భూమా నాగిరెడ్డి ఏర్పాటు చేసిన జగత్‌ పాల డెయిరీ ఎండీగా బ్రహ్మానంద రెడ్డి పని చేస్తున్నారు.

English summary
Other Party Leaders Joined Telugu Desam Party in the Presence of National President, Andhra Pradesh CM Nara Chandrababu Naidu at CM Camp Office, Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X