• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అల్లు అరవింద్‌కు రామోజీ గ్రూపు చెక్ : పోటీగా భారీ పెట్టుబడితో ఓటీటీ : అసలు లక్ష్యం అదే..!!

By Lekhaka
|

డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ఇప్పుడు జోష్ మీద ఉంది. అందునా ఓటీటీకీ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇంగ్లీషు..హిందీ భాషల్లో ఓటీటీలు దూసుకుపోతున్నాయి. కరోనా కారణంగా సినిమా హాళ్ల మూసివేత.. షూటింగ్ ల నిలిపివేత తో ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఇక, తెలుగు బాషలో ప్రస్తుతం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ ఒక్కటే ఉంది. దీనికి వినూత్నం గా నిర్వహించేందుకు ఆ సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని ప్రయోగాలు సక్సెస్ అయినా..కంటెంట్ లో మాత్రం లోపం కనిపిస్తోంది. దీంతో..ఆహా మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రామోజీ గ్రూపు ఓటీటీ..

రామోజీ గ్రూపు ఓటీటీ..

ఇదే సమయంలో పత్రికా...టీవీ...డిజిటల్ మీడియాలో ప్రత్యేక స్థానం ఉన్న రామోజీ గ్రూపు ఇప్పుడు ఓటీటీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని కోసం భారీగా పెట్టుబడి పెట్టే విధంగా కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. తెలుగులో ఉన్న ఓటీటీకి పోటీగా దీనిని తీసుకురావాలని..మరి కొంత మంది ఈ రంగంలోకి ప్రవేశించే ముందే తన స్థానం సుస్థిరం చేసుకోవాలనేది రామోజీ గ్రూపు ఆలోచన గా సమాచారం. ఇందు కోసం ఇప్పటికే ప్లానింగ్ పూర్తయిందని చెబుతున్నారు. దాదాపు రెండు వందల కోట్ల మేర పెట్టుబడిగా నిర్ణయంచినట్లు తెలుస్తోంది. కంటెంట్ పరంగ చూస్తే ఈనాడు గ్రూపుకు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. ఎంటర్ టైన్ మెంట్... వైద్యం-కామెడీ--సీరియల్స్..రియాల్టీ షోలతో పాటుగా ఈటీవీ కోసం కొనుగోలు చేసిన అనేక సినిమాలు వారి చేతుల్లో ఉన్నాయి.

 అల్లు అరవింద్ కు పోటీగా...

అల్లు అరవింద్ కు పోటీగా...

ఇక, కొత్త కొత్త ఓటీటీ ప్రమోషన్ సైతం వారికి ఖర్చు..శ్రమ అంతగా అవసరం లేదు. సొంత గ్రూపులోనే పత్రిక..టీవీ ఛానళ్లు ఉండటంతో సులువుగా ప్రమోట్ చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇక, క్రియేటివిటీ ఉన్న వారి కోసం ప్రస్తుతం రామోజీ గ్రూపు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈటీవీ భారత్ ప్రేక్షకుల్లోకి వెళ్లినా..గ్రూపు ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేదనే వాదన వినిపిస్తోంది. నిత్యం కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులను నిలబెట్టుకోవా లంటే.. వెబ్ సిరీస్ లు..ప్రత్యేక షో లు...సినిమాలు..ఆసక్తి కర ఇంటర్వ్యూలు...ఫేమస్ పర్సనాలిటీలను డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తేనే ప్రస్తుత పోటీలో నిలబడగలుగుతారని విశ్లేషకులు చెబుతున్నారు. అల్లు అరవింద్ కు సినిమాల పరంగా రికార్డులు క్రియేట్ చేసారు. గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాల్లో తిరుగులేని సక్సెస్ రుచి చూసారు.

సక్సెస్ ఎవరిది...ప్రేక్షకులు ఎవరితో..

సక్సెస్ ఎవరిది...ప్రేక్షకులు ఎవరితో..

కానీ, తెలుగు ప్రపంచంలో ఓటీటీ తీసుకొచ్చినా..అది అంతగా ప్రజల్లోకి వెళ్లటానికి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటంతో..మరింతగా తీర్చి దిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు పోటీగా రామోజీ గ్రూపు ఓటీటీ ప్రారంభిస్తే ఖచ్చితంగా అది ఆహా కు గట్టి పోటీ ఇవ్వటం ఖాయమనే వాదన ఉంది. కానీ, రెండు ఓటీటీలు పోటీ పడి మంచి కంటెంట్ అందిస్తే అది తెలుగు ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని పంచుతాయి. కానీ, ప్రస్తుత కరోనా సంక్షోభంతో అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. ఈ సమయంలో హిందీ..ఇంగ్లీషు తరహాలో ఈ తెలుగు ఓటీటీలు ఏ రకంగా ప్రేక్షకులకు దగ్గర అవుతాయో..ఏ మేరకు అభిమానం సంపాదిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.

English summary
Ramoji group plannig to itroduce OTT platform. This might have an impact on Allu Aravind's Aha Ott in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X