• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అవినీతిపార్టీ వైసిపితో బిజెపి జత...నిజమవుతోంది:లోకేశ్,అందుకే ప్రజల్లోకి:చంద్రబాబు

By Suvarnaraju
|

అమరావతి:అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు చెబుతున్న ప్రధాని నరేంద్రమోదీ మరోవైపు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వైసీపీతో ఎలా జత కడతారని మంత్రి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

విశాఖ జిల్లా అచ్యుతాపురంలో బ్రాండిక్స్‌ కంపెనీని సందర్శన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి-వైసిపి బంధం పై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ, వైసిపి నేత జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. కేంద్రం ప్రభుత్వ కూటమి ఎన్డీయేలో వైసీపీ చేరనున్నట్లు గత కొంతకాలంగా తాము చెబుతూనే ఉన్నామని, కేంద్రమంత్రి అథవాలే వ్యాఖ్యలతో ఇప్పుడు అదే నిజం నిజమవుతోందని తేలిపోయిందన్నారు.

 బయట పులులు...లోపల పిల్లులు

బయట పులులు...లోపల పిల్లులు

రాష్ట్రం కోసం పులుల్లాగా పోరాడుతున్నామని ప్రగల్భాలు పలికే వైసిపి ఎంపీలు పార్లమెంట్‌ లోపలకు వెళ్లేసరికి పిల్లుల్లాగా మారిపోతారని లోకేష్ ఎద్దేవా చేశారు. పార్లమెంటు బయట ప్లకార్డులతో ప్రదర్శనలంటూ హడావుడి చేసి లోపల మాత్రం ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటారని లోకేష్ చెప్పారు. ఇక వైసిపి అధినేత జగన్ జగన్మోహనరెడ్డి తన పాదయాత్రలో ప్రతిచోటా ముఖ్యమంత్రిపైనే విమర్శలు చేస్తున్నారు తప్ప అసలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన నరేంద్రమోదీని మాత్రం కనీసం ప్రశ్నించడం లేదని, ఈ విషయం ప్రజలు గమనించాలని లోకేష్ అన్నారు.

టిడిపి నుంచి వలసలా?...పేర్లు చెప్పండి

టిడిపి నుంచి వలసలా?...పేర్లు చెప్పండి

త్వరలో టిడిపి నుంచి కూడా వలసలు ఉంటాయన్న బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై లోకేష్ వ్యంగంగా స్పందించారు. అలా అయితే ఎవరెవరు బయటకు వెళతారో వాళ్ల పేర్లు కూడా ఆయనే చెపితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. గతంలో 1984 లో టిడిపిని చీల్చిన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ తరువాత జరిగిన పరాభవం అందరికీ తెలుసని, ఇప్పుడు అలాగే జరగబోతోందని పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి చురకలు అంటించారు.

చంద్రబాబు...

చంద్రబాబు..."వస్తున్నా మీకోసం"...ముగిసి ఐదేళ్లు

"వస్తున్నా మీకోసం" పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిఎం చంద్రబాబు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆనాడు

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను చూసి పాదయాత్ర చేయాలని నిర్ణయించానని చెప్పారు. అప్పుడు రైతుల ఆత్మహత్యలు, క్రాప్‌ హాలీడేలు, కరెంట్‌ కోతలు, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని, వాటిని నివారించాలనే పవిత్ర భావంతో పాదయాత్ర చేశానన్నారు.

 ఆనాటి...కాంగ్రెస్ అరాచక పాలన

ఆనాటి...కాంగ్రెస్ అరాచక పాలన

ఆనాడు కాంగ్రెస్ పాలనా కాలంలో ఎటు చూసినా భూ కబ్జాలేనని, టీడీపీ ఎమ్మెల్యేని పార్టీ ఆఫీస్‌లోనే హత్య చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కులాలు, మతాలను రెచ్చగొట్టారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఎన్నో కుట్రలు చేశారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో బీసీలను కసితో, కక్షతో అణగదొక్కారని ఆరోపించారు. బీసీ ఫెడరేషన్‌ పెట్టి కుర్చీ కూడా ఇవ్వలేదన్నారు. వారికి కనీసం రుణాలు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే నిందితులు కూడా తనపై మాట్లడడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు.

 పాదయాత్ర హామీలు...దాదాపుగా నెరవేర్చాం

పాదయాత్ర హామీలు...దాదాపుగా నెరవేర్చాం

ఎన్నికలకు ముందు టిడిపి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను 89 శాతం నెరవేర్చామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో వృద్ధులకు కేవలం రూ.200 మాత్రమే పింఛను ఇచ్చేవారని, తాము రాష్ట్రంలో 47 లక్షల మందికి రూ.1000 చొప్పున పింఛన్లు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానలతను తగ్గించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రానికి విభజన గాయాలు ఎన్ని ఉన్నా సొంత కష్టంతో నాలుగేళ్లుగా ఎదుగుతూ వచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజలకు ఎక్కడా ఇబ్బందిలేని పాలన ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే అభివృద్ధిలో ఇంకా చాలా ముందుకు వెళ్లేవాళ్లమని చంద్రబాబు వివరించారు.

English summary
Minister Lokesh said that their alligations about BJP-YCP relation is going to be true very soon. According to the Union Minister Athawale, it has proved true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X