• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మన రక్తం చల్లబడిపోయింది .. తిరిగి వేడెక్కాలంటే ఆ పని చెయ్యాలి :నాగబాబు

|

జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న గాడ్సే గురించి ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం ఎంతగా సాగిందో తెలిసిందే.. ఆ తర్వాత భారత దేశ కరెన్సీపై వీర యోధుల చిత్రాలు ముద్రించాలన్న నాగబాబు ఇప్పుడు తాజాగా భావి భారత పౌరులను సాహసం, పౌరుషం కలిగిన వీరులుగా పెంచాలని పేర్కొన్నారు.

నాగబాబు మరో సంచలనం... కరెన్సీ నోట్ల మీద వారి చిత్రాలను చూడాలని ఉంది

 సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న నాగబాబు

సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న నాగబాబు

ఇటీవల నాగబాబు నిత్యం వార్తల్లో ఉంటున్నారు. తాజాగా ఆయన వరుసగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న వీర సావర్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి సమరయోధుల చిత్రాలు కరెన్సీపై ముద్రిస్తే బాగుంటుందని, మహాత్మాగాంధీ బ్రతికుంటే తాను ఏ అభిప్రాయం వ్యక్తం చేశానో ఆయన కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసే వారిని పేర్కొన్నారు. నాడు స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన యోధులను గురించి భావితరాలు తెలుసుకోవాలని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.

భారతీయుల రక్తం శాంతి,అహింస మంత్రాలతో చల్లబడిపోయిందన్న మెగా బ్రదర్

భారతీయుల రక్తం శాంతి,అహింస మంత్రాలతో చల్లబడిపోయిందన్న మెగా బ్రదర్

ఇక తాజాగా బాలకృష్ణ విషయంలోనూ, సినిమా షూటింగ్స్ అనుమతి కోసం ప్రభుత్వంతో సంప్రదించినప్పుడు జరిగిన మీటింగ్ లో తనను పిలవకపోవడంపై బాలయ్య తనదైన శైలిలో స్పందించారు. ఇక నాగబాబు బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి నాగబాబు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ సారి ఆయన రౌడీలను గుండాలను టార్గెట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేసిన నాగబాబు భారతీయుల రక్తం శాంతి,అహింస మంత్రాలతో చల్లబడిపోయిందని పేర్కొన్నారు. తిరిగి భారతీయుల రక్తం వేడెక్కాలంటే నాటి చక్రవర్తుల, రాజుల పౌరుషం గురించి భావి తరాలకు తెలియాలన్నారు.

చక్రవర్తుల , రాజుల కథలను చదివిస్తే భావి తరాల్లో అయిన పౌరుషం వస్తుంది

చక్రవర్తుల , రాజుల కథలను చదివిస్తే భావి తరాల్లో అయిన పౌరుషం వస్తుంది

ఛత్రపతి శివాజీ, అశోక చక్రవర్తి, రాణా ప్రతాప్ సింగ్,సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్,శ్రీకృష్ణ దేవరాయలు,రాజ రాజ చోళుడు,సముద్రగుప్తుడు,మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివించాలని పేర్కొన్నారు. అలా చదివితే నెక్స్ట్ జనరేషన్ అయినా సాహసం,పౌరుషం,మరిగే రక్తం తో పెరుగుతారని వ్యాఖ్యానించారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది. వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులుగా తయారు చేద్దామని ఆసక్తికర ట్వీట్ చేశారు నాగబాబు.

 దేశం కోసం పోరాడే , దేశాన్ని ప్రేమించే వీరులు కావాలన్న నాగబాబు

దేశం కోసం పోరాడే , దేశాన్ని ప్రేమించే వీరులు కావాలన్న నాగబాబు

భారత దేశానికి ,దేశాన్ని ప్రేమించే వీరులు కావాలి, డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు అని పేర్కొన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు, గూండాలు,మాఫియా,ఫ్యాక్షన్ ,గుండా రాజకీయనాయకులు,కుహనా ఉదారవాదులు,ఉగ్రవాదుల నించి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక అంటూ పేర్కొన్నారు నాగబాబు.ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని అంటూ ఆయన భావితరాలలో దేశానికి ఉపయోగపడే సాహసాన్ని, పౌరుషాన్ని పెంపొందించేలా పెంచాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
In an interesting post on his Twitter account, Nagababu claimed that the blood of Indians was cool with the mantras of peace and non-violence. In order to warm the blood of the Indians again, the future generations need to know the stories of emperors and kings. With that the next generation will groe with adventure, civility and boiling blood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more