వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు సొంత కులం సెగ!: రగిలిపోతున్న నేతల మనోవేదన ఇలా!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంత్రివర్గ విస్తరణ చేటు తెచ్చేలానే కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంత్రివర్గ విస్తరణ చేటు తెచ్చేలానే కనిపిస్తోంది.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, శాఖల కేటాయింపులో తమకు అన్యాయం, అవమానం జరిగిందంటూ కమ్మ సామాజికవర్గంలోనే ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోకుండా, తిరిగి శాఖల కేటాయింపులోనూ తమ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులకు అప్రాధాన్యమైన శాఖలు ఇవ్వడంపై కమ్మ సామాజికవర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఇప్పటివరకూ రాజీనామాలు ప్రకటించిన బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్, అలక వహించిన ధూళిపాళ్ల, అసంతృప్తితో ఉన్న కేశవ్ తదితరులంతా అదే సామాజికవర్గం కావడం గమనార్హం.

బాబుపై తీవ్ర అసంతప్తి

బాబుపై తీవ్ర అసంతప్తి

మిగిలిన సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా వారెవరూ రోడ్డెక్కలేదు. కానీ, సొంత కమ్యూనిటీ నేతలు మాత్రం సోషల్‌మీడియాలో అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. తాజాగా జరిపిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో సంఖ్యకు తగినన్ని పదవులివ్వకపోవడంపై కమ్మ సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని వారు పార్టీ పెద్దల వద్దే వ్యక్తం చేస్తుండటం ప్రస్తావనార్హం.

రగిలిపోతున్న కోస్తా, సీమ నేతలు

రగిలిపోతున్న కోస్తా, సీమ నేతలు

ప్రధానంగా కోస్తా, అనంతపురం జిల్లాలకు చెందిన కమ్మ వర్గ నేతలు బాబు-లోకేష్ కలిసి తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో సర్వం నష్టంపోయిన తమను ప్రోత్సహించేందుకు బదులు చంద్రబాబు ఇతర వర్గాలను చూసి భయపడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు-లోకేష్ చుట్టూ ఉన్న పారిశ్రామికవేత్తలు, అధికారులైన కొందరు కమ్మ వారికే తప్ప, క్షేత్రస్థాయిలో జెండా మోసిన వారికి గుర్తింపు దక్కలేదన్న ఆవేదన ఆ వర్గంలో వ్యక్తమవుతోంది.

నష్టపోయిన పార్టీతోనే..

నష్టపోయిన పార్టీతోనే..

కరణం బలరాం, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజా, వెలగపూడి రామకృష్ణబాబు వంటి నేతలు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారని గుర్తు చేస్తున్నారు. వారిలో రెండు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్నందుకే కొందరికి తప్పనిసరి పరిస్థితిలో, ఒత్తిళ్లతోనే ఎమ్మెల్సీలు ఇచ్చారని, మంత్రి పదవుల్లో వీరెవరినీ కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వారికివ్వడం పట్ల అసంతృప్తి

వారికివ్వడం పట్ల అసంతృప్తి

ఎమ్మెల్యేలలో ఐదు శాతం ఉన్న రెడ్లకు నాలుగు మంత్రి పదవులివ్వడంతోపాటు, వారికి కీలక శాఖలివ్వడంపైనా కమ్మ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాఖల కేటాయింపులో కూడా తమ వర్గం పట్ల వివక్ష ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిటాల సునీతకు పౌరసరఫరాల శాఖ తప్పించి ప్రాధాన్యం లేని మహిళా సాధికారికత, శిశు సంక్షేమం, వృద్ధుల సంక్షేమం.. పత్తిపాటి పుల్లారావును వ్యవసాయశాఖ నుంచి తప్పించి ధరల నియంత్రణ వంటి శాఖలివ్వడంపై పెదవి విరుస్తున్నారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు రెడ్డి వర్గానికి ఎన్ని పదవులిచ్చారు.. అప్పుడు ఆయనేమైనా బాబు మాదిరిగా భయపడ్డారా.. అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

చంద్రబాబు భయపడుతున్నారా..?

చంద్రబాబు భయపడుతున్నారా..?

కమ్మవారిని ప్రోత్సహిస్తే మిగిలిన కులాలు భయపడతారని చంద్రబాబు ముందే భయపడుతున్నారని ఓ సీనియర్ నేత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు బాబు, చినబాబు చుట్టూ ఉన్న కమ్మ వారికి సొంత వర్గంతో సంబంధాలు లేవని, వారంతా వ్యాపారస్తులని, వైయస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరున్న వాళ్లే మళ్లీ ఇప్పుడు ఇటొచ్చారని చెబుతున్నారు. వాళ్లకు వారి పనులు మాత్రమే కావాలని, ప్రభుత్వాలతో పనిలేదన్నారు. కానీ మేం పార్టీ కోసం పనిచేసే వాళ్లం. ఆ తేడా ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పనికి రాకుండా పోతున్నాం

పనికి రాకుండా పోతున్నాం

‘అనవసరంగా మాపై కమ్మ ముద్రపడుతోంది. మీడియాలో కూడా గతంలో వైయస్ చుట్టూ ఉన్న వాళ్లే ఇప్పుడు బాబు దగ్గర చేరారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ భజన చేస్తూ, ఇక్కడ బాబు ప్రభుత్వంలోనూ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం-పార్టీలో కొందరు ఐఏఎస్, ఐపిఎస్‌లు, మరికొందరు నాయకులు కీలక పదవుల్లో ఉన్నప్పటికీ వారి వల్ల క్షేత్రస్థాయిలో తమకొచ్చే ఉపయోగమేమిటన్న ప్రశ్నలను మేము ఎదుర్కొంటున్నాం. కులం పేరు చెప్పి పైస్థాయి వాళ్లు లబ్ధి పొందుతుంటే, కింద స్థాయిలో పార్టీకి పనిచేసి, కులంముద్ర వేసుకుని మేమే ఎందుకూ పనికిరాకుండాపోయాం'ని సదరు సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో అసంతృప్తి జ్వాలలు

సోషల్ మీడియాలో అసంతృప్తి జ్వాలలు

తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కమ్మ సామాజికవర్గం తన అసంతృప్తి, ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తోంది. కేబినెట్‌లో మీరు, మీ కుమారుడు ఉంటే సరిపోతుందా బాబూ.. మిగిలిన కమ్మవారికి ఇస్తే లోకేష్‌కు పోటీ అవుతారని భావిస్తున్నారా?.. నాయకత్వ లక్షణాలున్న వారంటే మీకెందుకు చిన్నచూపు?నలుగురు రెడ్లకు ఇవ్వాల్సిన సందర్భమేమిటి. అంటూ విరుచుకుపడుతున్నారు. కమ్మలకు అన్యాయం చేయడం మీకు తగునా? అంటూ తమ అసంతృప్తిని ఘాటుగానే వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

English summary
It is said that own community leaders fired at Andhra Pradesh CM and TDP president chandrababu naidu for not giving ministers post to them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X