కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను వెళ్లను, గిడ్డి ఈశ్వరికి ఆదిలోనే గట్టి షాక్: చర్చలు ఫలించాయా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRCP MLA Giddi Eswari Joining TDP Today | Oneindia Telugu

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆమెతో పాటు పెద్ద ఎత్తున నియోజకవర్గానికి చెందిన, జిల్లాకు చెందిన నేతలు టీడీపీలో చేరుతున్నారు.

జగన్‌తో విసిగిపోయా, అన్ని చెప్తా: గిడ్డి సంచలనం, విజయసాయికి షాక్, ఆగ్రహానికి కారణాలివే!జగన్‌తో విసిగిపోయా, అన్ని చెప్తా: గిడ్డి సంచలనం, విజయసాయికి షాక్, ఆగ్రహానికి కారణాలివే!

 గిడ్డి ఈశ్వరితో పాటు పెద్ద ఎత్తున నేతలు

గిడ్డి ఈశ్వరితో పాటు పెద్ద ఎత్తున నేతలు

ఇందుకోసం ఆదివారం రాత్రి నుంచే నేతలు రాజధాని అమరావతికి చేరుకున్నారు. పలువురు వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు ఈశ్వరితో పాటు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గిడ్డి ఈశ్వరితో పాటు వారిని కూడా చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

 ఈశ్వరికి ఆదిలోనే షాక్

ఈశ్వరికి ఆదిలోనే షాక్

అయితే, గిడ్డి ఈశ్వరికి ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఆమెతో పాటు టీడీపీలో చేరుతారని భావించిన చింతపల్లి జెడ్పీటీసీ పద్మకుమారి అధికార పార్టీలోకి రావడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దీనిపై ఆమె సోమవారం స్పందించారు.

 చర్చలు ఫలించాయా?

చర్చలు ఫలించాయా?

తాను ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం లేదని పద్మకుమారి వెళ్లడించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా, వైసీపీ నేతల చర్చలు ఫలించడంతో ఆమె వెనక్కి తగ్గి ఉంటారని భావిస్తున్నారు. ఈశ్వరితో పాటు టీడీపీలో చేరేందుకు పదుల సంఖ్యలో వాహనాల్లో అభిమానులు, అనుచరులు వచ్చారు.

 గిడ్డి ఈశ్వరి తర్వాత మరో ఇద్దరు నుంచి నలుగురు

గిడ్డి ఈశ్వరి తర్వాత మరో ఇద్దరు నుంచి నలుగురు

ఇదిలా ఉండగా గిడ్డి ఈశ్వరి అనంతరం మరో ఇద్దరు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. వారు కూడా ఈ వారంలోనే చేరే అవకాశముంది. అయితే వారు ఎవరనేది తేలాల్సి ఉంది.

English summary
ZPTC Padma Kumari will not join Telugu Desam along with MLA Giddi Eswari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X