సూర్యప్రభ వాహనంపై పాండురంగడుగా అమ్మవారు(పిక్చర్స్)
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం ఉదయం అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. పంచాయుధాలైన శంఖు, చక్రం, గధ, విల్లంబులు, పద్మం ధరించిన అమ్మవారు పాండుంగడు అలంకారంలో భక్తులకు అభయం ఇచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామునే సుప్రభాత సేవతో మేల్కొలుపుచేసి నిత్యపూజలను నిర్వహించారు.
భక్తి పారవశ్యంతో భక్తులు అమ్మవారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పారుపల్లి రంగనాథ్ స్వరపరచి గానం చేసిన అన్నమయ్య సంకీర్తన చంద్రోదయం, శ్రీసాయికృష్ణ ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ గాయకులు గానం చేసిన శ్రీవైష్ణవ తిరునామములు సిడిలను, అన్నమాచార్యప్రాజెక్టువారి అన్నమయ్య సంకీర్తన స్వరమాలిక, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టువారి శ్రీభాగవతం గ్రంథాలను టిటిడి ఈఓ ఎంజి గోపాల్, జెఈఓ పోలా భాస్కర్, ఎడిటర్ చీఫ్ సముద్రాల లక్ష్మయ్య ఆవిష్కరించారు.
వేడుకగా రథోత్సవం
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రథోత్సవం వేడుకగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా కళాకారుల విన్యాసాలు అందరినీ అలరించాయి. బుధవారం సాయంత్రం అమ్మవారికి ఊంజల్ సేవ, అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం రాత్రి పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నవనీత చోరునిగా దర్శనమిచ్చారు.

బ్రహ్మోత్సవాలు
అంతకుముందు అమ్మవారిని ఊంజల్ సేవ అనంతరం వాహన మండపంకు వేంచేపుగా తీసుకువచ్చి కొలువుదీర్చారు.

బ్రహ్మోత్సవాలు
అనంతరం అమ్మవారిని పట్టుపీతాంబరాలు, రత్న కచిత వైడూర్య ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

బ్రహ్మోత్సవాలు
అలంకార భూషితురాలైన అమ్మవారు మరుని మేనమామగా, మర్రిమాను విత్తుగా విరహపు పాముండే పుట్టగా, దేవతల పాలిట గుజ్జన గూడుగా జలధిపాలి వుబ్బిరి ముందు వేడుకలు వెదజల్లే వెన్నెల రాశిగా అదృష్ట కీర్తి ప్రదాతగా కీర్తి గడించిన చంద్రుడిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు.

బ్రహ్మోత్సవాలు
భక్తుల కోలాటాలు, సాంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ ఆధ్యాత్మిక భావనలు ఉట్టి పడుతుండగా అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.

బ్రహ్మోత్సవాలు
భక్తి పారవశ్యంతో భక్తులు అమ్మవారి ఆశీర్వచనాలు అందుకున్నారు.

బ్రహ్మోత్సవాలు
ఈ సందర్భంగా ఎస్పీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పారుపల్లి రంగనాథ్ స్వరపరచి గానం చేసిన అన్నమయ్య సంకీర్తన చంద్రోదయం, శ్రీసాయికృష్ణ ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ గాయకులు గానం చేసిన శ్రీవైష్ణవ తిరునామములు సిడిలను, అన్నమాచార్యప్రాజెక్టువారి అన్నమయ్య సంకీర్తన స్వరమాలిక, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టువారి శ్రీభాగవతం గ్రంథాలను టిటిడి ఈఓ ఎంజి గోపాల్, జెఈఓ పోలా భాస్కర్, ఎడిటర్ చీఫ్ సముద్రాల లక్ష్మయ్య ఆవిష్కరించారు.

బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం ఉదయం అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది.

బ్రహ్మోత్సవాలు
పంచాయుధాలైన శంఖు, చక్రం, గధ, విల్లంబులు, పద్మం ధరించిన అమ్మవారు పాండుంగడు అలంకారంలో భక్తులకు అభయం ఇచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామునే సుప్రభాత సేవతో మేల్కొలుపుచేసి నిత్యపూజలను నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలు
మంగళవారం ఉదయం 7 గంటలకు అమ్మవారిని ఆలయం నుంచి వాహన మండపానికి వేంచేపుగా తీసుకువెళ్లి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు.

బ్రహ్మోత్సవాలు
తరువాత పట్టు పీతాంబర స్వర్ణా భరణాలతో అమ్మవారిని పాండు రంగడుగా అలంకరించారు. భక్తుల కోలాటాలు, సాంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ ఆధ్యాత్మిక భావనలు ఉట్టి పడుతుండగా అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.

బ్రహ్మోత్సవాలు
పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న తిరుమల వేదపండితులు.