వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు సభలో వైసిపి ఎంపీ అవినాష్, పులివెందులలో జగన్‌కు 'ఎన్టీఆర్'తో చెక్

కడప జిల్లా పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డి కూడా హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

పులివెందుల: కడప జిల్లా పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన సభా వేదిక పైనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు సమస్యలను వివరించారు.

అవినాశ్ ఇంకా మాట్లాడుతూ.. కృష్ణా జలాలు పులివెందులకు రావడం సంతోషమన్నారు. పైడిపాలెం ప్రాజెక్టుకు వైయస్ రాజసేఖర రెడ్డి శంకుస్థాపన చేశారని, ఇప్పటికి ఇది పూర్తి కావడం ఆనందంగా ఉందన్నారు.

అంతకుముందు, చంద్రబాబు పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

నాకు ఈ పదవి అవసరం లేదని మోడీకి చెప్పా: జగన్ ఇలాకాలో చంద్రబాబు

పులివెందులకు నీళ్లు రాకుండా వైసిపి అడ్డుకుందని ఆరోపించారు. ఇప్పుడు నీళ్లు ఇచ్చి తామేమిటో నిరూపించుకున్నామన్నారు. ఇక పులివెందులలో గొడవలు ఉండవని చెప్పారు. పులివెందులను దేశానికి ఆదర్శంగా మారుస్తానని చెప్పారు.

Paidipalem project named as NTR Sagar in Kadapa

పులివెందులకు నీళ్లు ఇచ్చినందుకు వైసిపి నేతలు అసహనంతో ఉన్నారన్నారు. ఇక్కడ ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. అనుభవం లేని వ్యక్తులు నన్ను విమర్శిస్తున్నా మీకోసం (ప్రజలు) భరిస్తున్నానని చెప్పారు. ఎప్పుడు పులివెందుల ఫ్యాక్షన్‌తో రగిలి పోవాలని కోరుకుంటున్నారని వైసిపిని ఉద్దేశించి మండిపడ్డారు.

పైడిపాలెం ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు

చంద్రబాబు ప్రారంభించిన పైడిపాలెం ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్టీఆర్ సాగర్‌గా నామకరణం చేశారు. ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఈ ప్రతిపాదన చేయగా, చంద్రబాబు ఆ పేరు పెట్టారు. అయితే, వైయస్ ఇలాకా అయిన కడప జిల్లాలో ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం జగన్‌కు చెక్ పెట్టేందుకేనని అంటున్నారు. ఎన్టీఆర్ సాగర్ పేరు వ్యూహాత్మకం అంటున్నారు.

English summary
Paidipalem project named as NTR Sagar in Kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X