హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్ట్: రెండేళ్లుగా విద్యార్థినుల ఇన్‌ఫైనెట్ జర్నీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రఖ్యాత కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం నుంచి కళాఖండాల ప్రదర్శన ప్రారంభమైంది. ఓక్రిడ్జ్ విద్యార్థినులు ఆరుగురు తమ కళాకృతులను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఓక్రిడ్జ్ విద్యార్థినులు అదితి లఖ్‌టికియా, అనురాధ రాయ్, అపురూప బాలసుబ్రహ్మణ్యం, దీక్ష సంజయ్, హేమహారిక చందన, వేద కసిరెడ్డి కుంచెకు పనిపెట్టి కాన్వాస్‌పై చిత్రించిన కళాచిత్రాలను ప్రదర్శించారు.

ఈ విద్యార్థినులు ద ఇన్‌ఫైనెట్ జర్నీ అనే కళాత్మక పయనం రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. ఓక్రిడ్జ్ విద్యార్థులు రెండేళ్ల తమ పయనాన్ని కాన్వాసుల ద్వారా ప్రదర్శించారు. వీరికి ఓక్రిడ్డ్ కళాగురువైన పియూ మహాపాత్ర, ఎంఎస్ వాసు, బి విశ్వేశ్వర రావు, జి రామకృష్ణ మద్దతు పలికి మార్గదర్శనం చేశారు

ఆరుగురు విద్యార్థినుల్లో అదితి మ్యూజిక్, స్నాజీ గ్లామర్ సబ్జెక్టును ఎంచుకుని తన కళానైపుణ్యాన్ని ప్రదర్సించింది. అదితి సంగీతాన్ని ఉత్సాహం, థ్రిల్, ఆకర్షణల దూతగా పరిగణిస్తుంది.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

అదితి ఆభరణాల తయారీలో తన మూడేళ్ల అనుభవాన్ని రంగరించి అద్భుతమైన చిత్తరువులను సృష్టించింది.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

అదిత పనితనానికి అపురూప తన కళాత్మక లేఖనంతో సొబగులు దిద్దింది. ఇవి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

హేమ నిజమైన ప్రయోగశీలి. ప్రకృతి ప్రేమికురాలు. ప్రకృతి అందాలను మంత్రముగ్ధులను చేసే విధంగా చిత్రీకరించి ప్రదర్శించారు.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

అనురాధ అనే విద్యార్థిని ప్రపంచంలోని రంగులు, అల్లికలు ఇమిడి ఉన్న రిథమ్‌లపై దృష్టి పెట్టింది.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

వేద కసిరెడ్డి మరో అద్భుత ప్రతిభ గల అమ్మాయి. ఆమె ఏ ఆలోచనైనా కచ్చితంగా స్వీకరించి తన సృజనతో అద్భుతంగా చిత్రరూపం కల్పిస్తుంది.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

వేద కసిరెడ్డి ప్రపంచంలోని విభేదించదగిన విషయాలపై దృష్టి సారించి గత రెండేళ్లుగా వీటిని తన కళాత్మకతతో చిత్తరువులుగా ఆవిష్కరించింది.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

వారు ఎంతో మంచి సృజనకారులు కావడం వల్ల వేద చిత్తరువులు పటిష్టమైన వివరణాత్మక నాణ్యతను కలిగి ఉన్నాయి.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

తమ విద్యార్థుల కళాతృష్ణను, ప్రతిభను చూసి గర్వంగా ఉందని, భవిష్యత్తులో వీరి కళాతృష్ణ పట్ల ఆసక్తిగా ఉందని ఓక్రిడ్జ్ కళాగురువు పియూ మహాపాత్ర అన్నారు.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

విద్యార్థుల నుంచి అత్యుత్తమ ప్రతిభను రాబట్టేందుకు ఓక్రిడ్జ్‌లోని దృశ్య కళా విభాగం అంతా ఒక జట్టు లాగా కృషి చేయడమేనని మహాపాత్ర అన్నారు.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

ఆర్ట్ గ్యాలరీని హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ కళాకారులు జగదీష్ మిట్టల్, సూర్యప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓక్రిడ్డ్ గచ్చిబౌలి క్యాంపస్ వైస్ ప్రిన్సిపాళ్లు బిజూ బేబి, హేమ చెన్నుపాటి పాల్గొన్నారు.

కళాప్రదర్శన

కళాప్రదర్శన

సందర్శన కోసం ఈ గ్యాలరీ శనివారం, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు తెరిచి ఉంటుంది.

కళా ప్రదర్శన

కళా ప్రదర్శన

తమ సృజనాత్మకతకు పనిపెట్టి కళాఖండాలను సృష్టించిన ఆరుగురు విద్యార్థినులు వీరే. వీరి భవిష్యత్తు చిత్రాలు చూడాలి మరి

English summary
Art exhibition held at Kalakrithi art gallery international school in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X