వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండదు: పాకిస్తాన్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలనం

|
Google Oneindia TeluguNews

పుల్వామా దాడుల నాటినుండి పాకిస్థాన్ కు మనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక అది జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దు చేయడంతో మరింత ముదిరింది. అప్పటినుండి భారతదేశంపై రగిలిపోతున్న దాయాది దేశం పాకిస్తాన్ అదును కోసం చూస్తోంది. తన వక్ర బుద్ధిని చూపిస్తూ దేశ సరిహద్దుల్లో కాల్పులకు తెగ పడుతోంది .
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాకిస్థాన్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఆర్టికల్ 370 రద్దుపై కాకినాడలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన అవగాహన సదస్సులో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పాకిస్తాన్ తో యుద్ధమే వస్తే భారత్ తన సత్తా చూపిస్తుందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చాలా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాటాకు చప్పుళ్ళకు తాము భయపడేది లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని పేర్కొన్న ఆయన పాక్ తో యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Pakistan will not be on the world map if war comes: Union Minister Kishan Reddy

ఈ సారి యుద్దమంటూ వస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ అనే దేశం కనిపించదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రావాల్సిన సమయం వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే )సంగతి కూడా తేల్చేస్తామన్నారు. ఆర్టికల్ 370 రద్దు పై జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జవహర్‌లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 370ని ఏర్పాటు చేశారని, ఆర్టికల్ 370 కారణంగా పాకిస్తాన్ తో ఇప్పటివరకు నాలుగు యుద్ధాలు జరిగాయని పేర్కొన్నారు.

ఆర్టికల్ 370 వల్ల 42 వేల మంది ఉగ్రవాదానికి బలయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రవాదం కారణంగా కశ్మీర్‌లో ఎన్నో దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు నోరు మెదప లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ నాయకులెవరూ ఎందుకని మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మోడీ సర్కార్ ఆర్టికల్ 370 విషయంలో సాహసోపేత నిర్ణయం తీసుకుందని, మరిన్ని సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని కాపాడడానికి మోదీ సర్కార్ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూకాశ్మీర్లో ఒక్క తుపాకీ కూడా పేలలేదన్న హోం శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

English summary
Union Minister Kishan Reddy was very optimistic that India will show its strength in case of a war with Pakistan. He said he was prepared to sacrifice his life for the country and made key statements about the war with Pakistan. He warns that if war comes Pakistan will not be seen on the world map
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X