వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊమెన్ చాందినీనే కలుస్తా: పళ్లంరాజుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ పార్టీ వీడిన పాత నేతలను దరి చేర్చుకోవాలని ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ ఏపీ ఇంచార్జ ఊమెన్ చాందీ ఇటీవల పార్టీ సీనియర్లతో భేటీ అయి.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్‌లను తిరిగి పార్టీలోకి రప్పించాలని నిర్ణయించారు.

రేసులో బాబు-పవన్-జగన్, కాంగ్రెస్ 'పాత' ప్లాన్: ఇక కిరణ్ కుమార్, ఉండవల్లిలకు గాలం! రేసులో బాబు-పవన్-జగన్, కాంగ్రెస్ 'పాత' ప్లాన్: ఇక కిరణ్ కుమార్, ఉండవల్లిలకు గాలం!

ఇందులో భాగంగా పళ్లం రాజు మంగళవారం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఆయన ఆహ్వానించారు. దీనికి కిరణ్ రెడ్డి స్పందిస్తూ.. తాను పార్టీ ఏపీ ఇంచార్జ్ ఊమెన్ చాందీని కలిసి మాట్లాడుతానని తెలిపారని తెలుస్తోంది.

Pallam Raju meets Kiran Kumar Reddy

కాగా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పూర్వవైభవం కోసం ఉవ్వీళ్లూరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నది. రాష్ట్ర ప్రజలు కనీసం ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు కాదు కదా.. ఎన్నో చోట్ల ఆ పార్టీ నేతలకు డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ పాత రోజుల కోసం ప్రయత్నిస్తోంది.

English summary
Congress Party senior leader Pallam Raju on Tuesday met Former Chief Minister Kiran Kumar Reddy and asked him to join Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X