వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమని చెప్పం కానీ, బాధగా ఉంది: టిపై పల్లంరాజు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pallam Raju
న్యూఢిల్లీ: విభజన వెనక్కి వెళ్లిందని అప్పుడే చెప్పమని, తాము పదవులలో ఉండగానే ఇలా జరిగిందనే బాధ ఉందని కేంద్రమంత్రి పల్లం రాజు సోమవారం అన్నారు. విభజన అంశం వెనక్కు పోయిందని, తాము విజయం సాధించామని అప్పుడే చెప్పలేమన్నారు. తాము పదవుల్లో ఉండటం వల్ల రాజీనామాలు చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు రావటంలో ఆశ్చర్యం లేదన్నారు.

పదవుల్లో ఉన్నా ఇలాంటిది జరిగిందన్న బాధ తమలోనూ ఉందని, కాబట్టే దీనిని సరిదిద్దటానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు హాని జరిగినప్పుడు తాము పదవుల్లో ఉండబోమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా ఒప్పించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసి నిర్ణయంతో మూడు ప్రాంతాలకు న్యాయం జరగటం లేదని, మూడు ప్రాంతాలకూ న్యాయం చేయాలని సమైక్యంగా ఉంచితేనే పరిష్కారం ఉంటుందన్న విషయాన్ని అధిష్టానానికి చెబుతున్నామన్నారు.

ఈ విషయంలో విజయవంతమవుతామని భావిస్తున్నామన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు అంతా కలిసి గట్టిగా విజ్ఞప్తి చేయటం వల్ల ఆంటోనీ కమిటీ ఏర్పాటైందని, రాష్ట్ర విభజన అంశాన్ని ఈ కమిటీ సంపూర్ణంగా పరిశీలిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆంటోనీ కమిటీ సభ్యులు త్వరలోనే రాష్ట్రానికి వస్తారని భావిస్తున్నామన్నారు. వారు వస్తేనే రాష్ట్ర విభజనను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తోందీ తెలుస్తుందన్నారు. హైదరాబాద్ నగరం సెంటిమెంట్‌పై ఆధారపడిన విషయమని, ఈ నగరం మనదీ అనుకుని అంతా అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయాన్ని అమలు చేసేముందు మూడు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడాలని, వారికి హాని జరగకూడదని ఆంటోనీ కమిటీకి చెప్పామన్నారు.

English summary
Central Minister Pallam Raju on Monday said they are 
 
 confident on United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X