వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ బాబు! ఘనత చంద్రబాబుదేనని మంత్రి పల్లె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palle says e-cabinet credist is goes to Chandrababu
హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి ఈ-కేబినెట్ సమావేశం నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం చెప్పారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరుల సమావేశంలో సాయంత్రం వివరించారు.

మావోయిస్టుల పైన మరో ఏడాది నిషేధం పొడిగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల పైన ఎక్కడికి అక్కడ కమిటీలు వేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిని అక్టోబర్ 2 నుండి 1235 గ్రామాల్లో మొదటి విడతగా ప్రారంభిస్తామని చెప్పారు. ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా విద్యుత్ లోటును భర్తీ చేస్తామని చెప్పారు.

అనంతపురం జిల్లాలో 5,500 ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. కర్నూలులో సౌర విద్యుత్ కోసం 5వేల ఎకరాలు కేటాయిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 132 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని చెప్పారు. లోటును ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు.

English summary
Taking a step further in eGovernance, the Andhra Pradesh state Cabinet has now gone paperless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X