వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాటి బెల్లం:రుచిలో మేటి...ఆరోగ్యానికి దీనికిదే సాటి;తిరుపతిలో అందుకే అలా!

|
Google Oneindia TeluguNews

తిరుపతి:ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం మనిషి ఎంత డబ్బయినా వెచ్చించేందుకు...ఎంత కష్టమైనా భరించేందుకు సంసిద్దమవుతున్నాడు. కారణం నిత్యజీవితంతో ఎన్నో విధాలా అనారోగ్యం పొంచి ఉండటమే. అయితే మనిషిని ఆరోగ్యంగా ఉంచాలన్నా...అనారోగ్యం పాలు చెయ్యాలన్నా ఆ శక్తి ఆహార పదార్థాలకు ఉంది.

శరీరానికి హాని చేసేవి తింటే రోగాలు...మేలు చేసేవి భుజిస్తే ఆరోగ్యమూ సంప్రాప్తించడమూ సహజమే. అలా మేలు చేసే ఆహార పదార్థాల్లో తాటి బెల్లం ఒకటి. ఈ విషయాన్ని పూర్వీకుల నుంచి నేటి కాలం వరకూ అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. తాటి బెల్లం విశిష్టత గురించి 100 సంవత్సరాల క్రితం 'వస్తుగుణ దీపిక'లో రాసి ఉందట. అందుకే ఎక్కడైనా తాటి బెల్లం అమ్మకానికి వస్తే ధర ఎక్కువైనా కొనేందుకు జనం ఎగబడతారు. ఇక్కడా అదే జరిగింది!..వివరాల్లోకి వెళితే..

తిరుపతిలో...తాటి బెల్లం

తిరుపతిలో...తాటి బెల్లం

తాటి బెల్లం ఎప్పుడు కావాలంటే అప్పుడు...ఎక్కడ కావాలంటే అక్కడ దొరకదు. అయితే అలాంటి తరుణంలో ఇప్పుడు తిరుపతి వాసులు తాటిబెల్లం వారోత్సవాలు జరుపుకుంటున్నారు. అంటే అవేవో వేడుకలు అనుకునేరు...అదేం కాదు గాని...అరుదుగా లభించే తాటి బెల్లాన్ని ప్రస్తుతం తిరుపతిలో తమిళనాడు రాష్ట్రం తిరుచెందూరు నుంచి వచ్చిన పలువురు చిరు వ్యాపారులు విక్రయానికి ఉంచారు. ఇలా ఇక్కడ కొన్ని రోజులే అమ్ముతారట. చెర్లోపల్లె, అలిపిరి జూ పార్కు, రేణిగుంట రోడ్డులో మొబైల్‌ దుకాణాలు ఏర్పాటు చేశారు. అందుకే జనాలు వీటి రుచి...ఆరోగ్యం దృష్ట్యా ఈ తాటిబెల్లం బర్ఫీలను ఎగబడి మరీ కొంటున్నారు. ధర విషయాని కొస్తే రకాన్ని బట్టి...నాణ్యతను బట్టి కిలో రూ.140 నుంచి 240 వరకూ పలుకుతోంది.

అందుకే...అంత ధర

అందుకే...అంత ధర

సాధారణ బెల్లం కిలో 60, 70 రూపాయలకు మించదు. కానీ తాటి బెల్లం ధర సాధారణ బెల్లానికి రెట్టింపు ఉంటుంది. కారణం దాని ఔషధ గుణాలపై ప్రజలకు ఉన్న నమ్మకమే. ఈ బెల్లంలో చిన్నపాటి జబ్బుల నుంచి అనీమియా ను దూరం చేసే సుగుణాలు ఎన్నో ఉన్నాయని...అంతేకాదు వివిధ రకాల అనారోగ్యాలకు ఈ తాటి బెల్లం తినడం ద్వారా చెక్ చెప్పొచ్చనేది వారి విశ్వాసం. మనిషి ఆరోగ్యంతో పోలిస్తే ధర అనేది అన్ని సార్లు పరిగణనలోకి తీసుకోకూడదని కొనుగోలుదారుల మాట. తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్ చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగం.అంటున్నారు.

ఆరోగ్యానికి...ఇవీ ప్రయోజనాలు

ఆరోగ్యానికి...ఇవీ ప్రయోజనాలు

తాటిబెల్లంలో విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం పోగొడుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పరుస్తుంది. ఐరన్‌ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది. యాంటాక్సిడెంట్ల కారణంగా శరీరంలో దెబ్బతిన్న కణాలను సరిదిద్దడంలో సహకరిస్తుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌ కూడా ఉంటుంది. శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలనూ తొలగిస్తుంది. దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూకస్‌ తొలగించడంలోనూ సాయపడుతుంది. మైగ్రేన్‌, బరువు తగ్గడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

తాటి బెల్లం...తయారీ

తాటి బెల్లం...తయారీ

పులియని తాజా తాటి నీరా ను మరగబెట్టడం ద్వారా తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. అందుకే పులియకుండా దీని కోసం సేకరించే పాత్రలో ఒక శాతం సున్నాన్ని పూతగా పూస్తారు. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్ గల జిఇ షీట్‌తో చేసిన బాణలిలో పోసి, వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు మరగబెట్టి, చల్లార్చి, వడపోయాలి. ఈ దశలో పీహెచ్‌ను చూడాలి. కొంచెం సూపర్‌ను కలపడం ద్వారా పిహెచ్ 7.5 ఉండే విధంగా చూసి వేడి చేయాలి. నీరా మరుగుతున్నప్పుడు వచ్చే తెట్టును తీసి వేయాలి. ఇలా చేస్తే సున్నం విరుగుతుంది. ఈ విధంగా దాదాపు 2 నుంచి 3 గంటలు మరగబెడితే...నీరా బాగా చిక్కబడుతుంది. ఈ దశలో ఒక బొట్టును చల్లని నీటిలో వేసి బెల్లం ఏర్పడే దశను గుర్తించవచ్చు. నీటిలో ఇది పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపడం ద్వారా చల్లార్చి ఫ్రేములో పోస్తే...మనకు కావలసిన ఆకారంలో తాటి బెల్లం అచ్చులను పొందవచ్చు.

English summary
Tirupathi:Palm jaggery is the most beneficial and nutrient-rich variety of raw jaggery. It is prepared from palm tree extract and is loaded with minerals and vitamins. But It is also pricey. But palm jaggery benefits are enviable because of its medicinal properties, we won’t really mind it!...Tirupati residents now taste the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X