వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొన్నాల ఓటమి సిగ్గు చేటు: పాల్వాయి, జానారెడ్డి వల్లే

|
Google Oneindia TeluguNews

Palvai fires at Ponnala
హైదరాబాద్: తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షుడి స్థానంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమిపాలవడం సిగ్గు చేటని పొన్నాలపై ధ్వజమెత్తారు. సీట్ల పంపిణీలో పొన్నాల లక్ష్మయ్య డబ్బులు తీసుకున్నారని పాల్వాయి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారకుడైన పొన్నాల లక్ష్మయ్య.. పిసిసి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పొన్నాలకు పార్టీని నడిపే శక్తి లేదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పూర్తిగా విఫలమయ్యామని పాల్వాయి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి దాపురించేది కాదని అన్నారు.

కొందరు దురాశపరులు టిఆర్ఎస్ పార్టీతో పొత్తు అనవసరమన్నారని పాల్వాయి చెప్పారు. టిఆర్ఎస్‌తో పొత్తు లేకుండా చేసింది మాజీ మంత్రి జానారెడ్డి అని ఆరోపించారు. తన కూతురు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయలేదన్న పాల్వాయి, పార్టీని బతికించడానికే పోటీ చేసిందని తెలిపారు. ఎంత వద్దన్నా వినకుండా చచ్చిపోయిన సిపిఐ పార్టీతో పెట్టుకున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసీ పోలవరంపై మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ తప్పుడు ప్రచారం చేశారని పాల్వాయి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్‌ను వెంటనే తప్పించాలని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

English summary
Congress Party senior leader Palvai Govardhan reddy on Saturday fired at Telangana PCC Chief Ponnala Laxmaiah for his defeat in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X