వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింల మెప్పు పొందేందుకే పార్కుకు నిజాం పేరు: కెసిఆర్‌పై పాల్వాయి

|
Google Oneindia TeluguNews

Palvai writes a letter to KCR
హైదరాబాద్: నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పేరు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఓ లేఖ రాశారు.

నిజాం బలగాలు, రజాకార్ల దాష్టీకాలకు తెలంగాణలో ఎన్నో కుటుంబాలు బలయ్యాయని, తమ కుటుంబంపై కూడా దాడి జరిగిందని పాల్వాయి తన లేఖలో పేర్కొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనం కావడం కోసం అనేక మంది తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు.

కెబిఆర్ పార్కుకు నిజాం పేరు పెట్టాలన్న ఆలోచనను మరోసారి ఆలోచించాలని పాల్వాయి కోరారు. కేవలం ముస్లింల మెప్పు పొందేందుకే నిజాం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారని, ఇది సరికాదని లేఖలో స్పష్టం చేశారు.

నేడు తెలంగాణ ప్రకటన దినం: పొన్నాల

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9ని రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ ప్రకటన దినం'గా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మాటకు కట్టుబడి తెలంగాణను ఇచ్చిన సోనియాకు యావత్ రాష్ట్రం రుణపబడి ఉంటుందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ రోజును పురస్కరించుకుని సోనియా జన్మదినం, తెలంగాణ ప్రకటన దినంను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు.

English summary
Congress MP Palvai Govardhan Reddy on Monday wrote a letter to Telangana CM K Chandrasekhar Rao on name changing of KBR park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X