హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభిమానులకిచ్చిన మాట నిలబెట్టుకున్న 'డార్లింగ్' ప్రభాస్

హైదరాబాద్ కావూరి హిల్స్ లో 'ఫ్యాన్స్ గ్రీట్ అండ్ మీట్ ప్రభాస్' పేరుతో జరిగిన కార్యక్రమంలో యంగ్ రెబల్ స్టార్ తన అభిమానులను కలిశారు.

|
Google Oneindia TeluguNews

'ఒట్టేసి ఒకమాట.. ఒట్టేయకుండా ఒకమాట చెప్పను.'. అనేది ఛత్రపతి సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైలాగ్. నిజజీవితంలో కూడా తాను అదే పాటిస్తానని డార్లింగ్ నిరూపించారు. 'రాధేశ్యామ్' సినిమా ప్రమోషన్ సమయంలో ఆ చిత్ర యూనిట్ ఓ కాంటెస్ట్ నిర్వహించింది. ఆ సమయంలో ఓ ఫారం పూర్తి చేయమంటూ అభిమానులకు సూచించింది. అది పూర్తి చేసి సబ్మిట్ చేసిన అభిమానుల నుంచి 100 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి నేరుగా ప్రభాస్‌ను కలిసే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

'రాధేశ్యామ్' విడుదలై చాలారోజులవుతోంది. 'సలార్' తోపాటు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు ప్రభాస్. రాధేశ్యామ్ సమయంలో అభిమానులను కలుస్తానని మాట ఇచ్చినట్లుగా ఈనెల 30న హైదరాబాదులోని కావూరి హిల్స్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్ ను కలిశారు. వారితో కొద్దిసేపు ముచ్చటించడంతోపాటు ప్రతి ఒక్కరితో ఫొటో దిగి వారిని ఆనందింపచేశారు. 'ఫ్యాన్స్ గ్రీట్ అండ్ మీట్ ప్రభాస్' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు.

Pan india star Prabhas keeps his word,Meets fans at a secret function held in Hyderabad

యంగ్ రెబల్ స్టార్‌తో ఫోటో దిగిన అభిమానులు పాన్ ఇండియా స్టార్‌ను కలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. వారి ఆనందానికి అవధుల్లేవు. గోప్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాతో సహా ఎవరినీ ఆహ్వానించలేదు. రహస్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఫ్యాన్స్‌ను ఫోన్లు, ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించకపోవడంతో వారంతా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.

English summary
The program was organized under the name of 'Fans Greet and Meet Prabhas' and fans came from Telugu states as well as from other states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X