వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై పనబాక క్లారిటీ: జగన్‌లా దోయలేదని విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Panabaka Laxmi
హైదరాబాద్: గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలన్న తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తనకు ఎక్కడా వేలాది ఎకరాల భూములు లేవని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. ఇటీవల ఆమె గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించారు.

తనకు ఎక్కడా వేల ఎకరాల భూములు లేవన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నా అభివృద్ధి పనులకు నియోజకవర్గంలో అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు.

రాయల టికి నో: ఈటెల

తాము ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణకు అంగీకరించేది లేదని తెరాస నేతలు ఈటెల రాజేందర్, శ్రవణ్ కుమార్‌లు వేర్వేరుగా చెప్పారు. పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని లేదంటే మరో ఉద్యమం తప్పదని ఈటెల హెచ్చరించారు. రాయల టిని తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందని, సిడబ్ల్యూసి ప్రకారమే పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని శ్రవణ్ అన్నారు.

జగన్‌పై విహెచ్ నిప్పులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన జగన్ నోటీకి వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రాన్ని విభజించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రధాని కాలేడన్నారు. సోనియాది జగన్‌లా దోచుకున్న కుటుంబం కాదని విమర్శించారు.

దేశాన్ని విభజించాలనుకున్న సమయంలో కాంగ్రెసు, ప్రజలు కోరితే సోనియా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో ఆయన బలం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే తెలిసిందన్నారు. రేపటి నుండి తాము తెలంగాణలో యాత్ర చేపడతామన్నారు.

English summary
Union Minister Panabaka Laxmi on Sunday has clarified on her 'new capital' statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X