వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెళ్లండి, మేమున్నాం: లగడపాటికి పనబాక, కిల్లి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Panabaka and Kili counter to Lagadapati
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నుండి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి వెళ్తారని ఆ పార్టీ నేతలే చెబుతున్న విషయం తెలిసిందే. శనివారం విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పినట్లు 30 మంది కాదని 70 పోతారని చెప్పారు. ఈ జంపింగ్ అంశంపై కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు స్పందించారు.

పార్టీని వీడి వెళ్లిపోయేవారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని సొంత ప్రయోజనాల కోసం వెళ్లిపోయే వారిని పట్టించుకోనక్కర్లేదని కృపారాణి అన్నారు. పార్టీని అనవసరంగా విమర్శిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని మహామహులు వేసిన పునదులు బలంగా ఉన్నాయని వాటిని కదిపే సత్తా ఏవరికీ లేదని శ్రీకాకుళంలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో చెప్పారు. అనసవరంగా పార్టీని విమర్శిస్తే ఖబడ్దార్ అంటూ రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి హెచ్చరించారు.

మరోవైపు పనబాక లక్ష్మి గుంటూరు జిల్లా బాపట్లలో మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్లదలచుకున్న వారు వెళ్లిపోతే తాము పార్టీని బలోపేతం చేసుకుంటామని అన్నారు. ప్రజలు స్పష్టంగా ఉన్నారని నాయకులే పిల్లివాటం చూపుతున్నారన్నారు. ఇక, 2014 అసెంబ్లీ ఎన్నికలలో తాను కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేస్తానని మంత్రి తోట నరసింహం స్పష్టం చేశారు.

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిరాధారమని కాకినాడలో చెప్పారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, సమైక్యాంధ్రలోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తామన్నారు. 2014 ఎన్నికల్లో తోట వాణి ఎక్కడ నుంచీ పోటీ చేయరని, ఇంట్లో వంట చేస్తారని తోట చమత్కరించారు.

English summary
Union Minister Killi Kruparani and Panabaka Laxmi on Saturday said they are ready to strengthen party in Seemandhra region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X