గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేం సిద్ధమే, తెలంగాణ బిల్లుకు ఓటేస్తాం: పనబాక

By Pratap
|
Google Oneindia TeluguNews

Panabaka Lakshmi
గుంటూరు/ న్యూఢిల్లీ: సీమాంధ్రకు సరైన ప్యాకేజీ ఇస్తే తాము రాష్ట్ర విభజనకు సిద్ధమేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. సీమాంధ్రను మరో సింగపూర్‌గా, బాపట్లను మరో భాగ్యనగరంగా తీర్చిదిద్తుతామని ఆమె చెప్పారు. మంగళవారం ఉదయం గుంటూరుకు వచ్చిన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వచ్చే శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎట్టి పరిస్థితిలోనూ నష్టం వాటిల్లదని ఆమె అన్నారు. రాష్ట్ర విభజనపై బిజెపి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెసు అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు తాము ఓటు వేస్తామని స్పష్టం చేశారు.

యుటిగా ఆంగీకరించం..

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రతిపాదనకు తాము అంగీకరించేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. యుటిగా చేస్తే ఏ చిన్న గోడ కట్టాలన్నా కేంద్రం అనుమతి అవసరమవుతుందని ఆయన అన్నారు. జివోఎంతో భేటీ కావడానికి ఢిల్లీ వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

భద్రాచలం తెలంగాణలో భాగంగానే ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల భయాందోళనలను తొలగించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. విభజన చేస్తున్నవారే అనంతర సమస్యలను పరిష్కరించాల్సి ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు.

English summary
Union minister from Seemmandhra Panabaka Lakshmi said that they are prepared for the bifurcation of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X