అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్: 29 గ్రామాల్లో పంచాయితీ ఎన్నికలు: సహకరిస్తారా..బహిష్కరిస్తారా..!

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానుల ప్రతిపాదన...అమరావతిలో ఆందోళనల నడుమ వైసీపీ ప్రభుత్వం కొత్త వ్యూహానికి తెర తీసింది. అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు రాజధాని తరలింపు వ్యతిరేక ఆందోళనల్లో ఉండగా..అక్కడ ఎన్నికల పంచాయితీకి ప్రభుత్వం సిద్దం అవుతోంది. అమరావతి రాజధానిగా ప్రకటించిన తరువాత ఆ ప్రాంతాన్ని మున్సిపాల్టీ..కార్పోరేషన్ గా నాటి..నేటి ప్రభుత్వాలు గుర్తించలేదు. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారులో భాగంగా..ఈ రోజు అమరావతి పరిధిలోని 29 గ్రామాల రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. దీని ద్వారా అక్కడ ప్రస్తుత పరిస్థితిని..డైవర్ట్ చేసేందుకు సైతం ఈ నిర్ణయం అధికార పార్టీకి మేలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీని ద్వారా ఆ ప్రాంతంలో కొత్త రాజకీయ సందడి మొదలై..ఆందోళనల తీవ్రత తగ్గుందనేది మరో ఆలోచన. అయితే, అసలు ఇప్పుడు అక్కడ ప్రజలంతా ఒక్కటిగా..రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్న సమయంలో..వారు ఎన్నికలకు సిద్దం అవుతారా..లేక బహిష్కరణ వంటి సంచలన నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తి కరమే...!

అమరావతిలో పంచాయితీ ఎన్నికలు..

అమరావతిలో పంచాయితీ ఎన్నికలు..

అయిదేళ్ల కాలంగా ఏపీకి రాజధానిగా ఉన్న అమరావతిలో ఇప్పుడు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అక్కడ రాజధాని తరలింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళనలు..నిరసనలు కొనసాగుతున్నా యి. వారి ఆందోళనల మీద ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. రైతులకు అన్యాయం చేయమని చెబుతోంది. కానీ, ఏ రకంగా న్యాయం చేసేదీ వివరించటం లేదు. ఇదే సమయంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఇందులో బాగంగా..అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లోనూ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. అమరావతిని రాజధానిగా ఖరారు చేసినా..ఆ ప్రాంతాన్ని మున్సిపాల్టీ లేదా నగరంగా అధికారికంగా గుర్తించలేదు. దీంతో..ఇప్పుడు అక్కడ గ్రామాలుగానే పంచాయితీ ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఈ రోజు కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీంతో..ఇప్పుడు ఏం జరుగుతోందనే ఉత్కంఠ మొదలైంది.

వైసీపీ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం..

వైసీపీ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం..

అమరావతిలో ఇప్పుడు పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. అందులో తొలుత అక్కడ ఇప్పుడున్న ఆందోళనలకు డైవర్ట్ చేయటం. రెండోది టీడీపీని అక్కడ మరింతగా డామేజ్ చేయటం. అందులో భాగంగా..అయిదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ రాజధాని పరిధిలో ఉన్న ఆ గ్రామాలను కలిపి మున్సిపాలటీ లేదా కార్పోరేషన్ గా ప్రకటించకపోవటాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఆ వ్యవహారం పెద్ద సమస్య కాదని..కేవలం స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తే..ప్రభుత్వం వెంటనే ఆ ప్రాంతాన్ని మున్సిపాల్టీగా లేదా కార్పోరేషన్ గా ప్రకటించే అవకాశం ఉన్నా..ఆ గుర్తింపు అమరా వతి ప్రాంతానికి ఇవ్వకుంగా పంచాయితీ స్థాయిలోనే కొనసాగించిందని వైసీపీ చెబుతోంది. దీంతో..హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాము రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నామని..అందులో భాగంగానే 29 గ్రామాలకు రిజర్వేషన్లు ప్రకటిస్తున్నారనేది ప్రభుత్వ వాదన.

సహకరిస్తారా..బహిష్కరిస్తారా..

సహకరిస్తారా..బహిష్కరిస్తారా..

ప్రభుత్వం ఇప్పుడు పంచాయితీ ఎన్నికల ద్వారా రాజధాని ప్రాంతంలో తమ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు కొంత వరకు పక్క దోవ పడుతాయని అంచనా వేస్తోంది. గ్రామాల్లో సాధారణం గా ఉండే రాజకీయాలు..వర్గాలకు పంచాయితీ ఎన్నికలే కీలకం. అయితే, అమరావతి ప్రాంతంలో మాత్రం ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరూ రాజధాని తరలింపుకు వ్యతిరేకం గా పోరాటం చేస్తున్నారు. అన్ని పార్టీల వారు ఇందులో బాగస్వాములయ్యారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించి..అక్కడ ఎన్నికల వాతావరణం తీసుకొచ్చినా..స్థానికులు అందులకు సిద్దం అవుతా రా లేక దీని పైన కీలక నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న ఈ గ్రామాల ప్రజలు మరి..తమ గ్రామాల పరిధిలో ఎన్నికలకు సహకరిస్తారి..లేక నిరసనలో భాగంగా పంచాయితీ ఎన్నికలను బహిష్కరిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

English summary
AP Govt ready to announce local body elections reservations for Amaravati villages to day.It creating curiosity on local villages people decision on participating in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X