• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -అధికారులపై వేటు చెల్లదు -సుప్రీంకోర్టులో తెలుగు జడ్జి చేతికి కేసు

|

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. నోటిఫికేష్ జారీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాయత్తం కాగా, సుప్రీంకోర్టులో పెండింగ్ పిటిషన్ ను కారణంగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాను కోరింది. అదేసమయంలో ఎస్ఈసీ వేటు వేసిన అధికారులను తొలగించబోమంటూ నిమ్మగడ్డకు జగన్ సర్కారు షాకిచ్చింది. శుక్రవారం సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బలు తగలగా, ఈ వివాదానని పరిష్కరించే బాధ్యత సుప్రీంకోర్టులోని తెలుగు జడ్జిపై పడింది. వివరాల్లోకి వెళితే..

నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!

అధికారులకు జగన్ అండ..

అధికారులకు జగన్ అండ..

ఎన్నికల ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కూ ఉంటాయన్న నిమ్మగడ్డ రమేశ్.. నిబంధనలు అతిక్రమించారనే కారణంతో 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతోపాటు తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై బదిలీ వేటు వేశారు. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌కు, డీజీపీకి నిమ్మగడ్డ లేఖ రాశారు. కానీ ఆ ఉత్తర్వులను జగన్ సర్కారు తిరస్కరించింది. శుక్రవారం సాయంత్రం ఎస్ఈసీకి రాసిన లేఖలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

 కొవిడ్ వారియర్ల బదిలీ కుదరదు..

కొవిడ్ వారియర్ల బదిలీ కుదరదు..

ఎన్నికల విధుల నుంచి కొందరు అధికారులను తొలగించాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే పరిస్థితి లేదని సీఎస్ దాస్ లేఖలో పేర్కొన్నారు. ఆ అధికారులందరూ ప్రస్తుతం కొవిడ్ ప్రోటోకాల్ అమలు విధుల్లో బిజీగా ఉన్నారని, కాబట్టి వారిపై చర్యలు తీసుకోవడం కుదరదని తెలిపారు. అదే సమయంలో ఎన్నికల వాయిదాకు కూడా ప్రభుత్వం కోరింది. కరోనా వ్యాక్సినేషన్, పంచాయితీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదంటూ.. మొదటి డోస్‌ వ్యాక్సిన్ తీసుకున్న వారికి రెండోడోస్‌ ఇచ్చిన నాలుగు వారాలకు ఇమ్యూనిటీ వస్తుందని, వ్యాక్సినేషన్ ప్రక్రియ తర్వాతే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త తేదీలతో కొత్త నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు జరుపుకొందామని లేఖలో సీఎస్ దాస్ పేర్కొన్నారు. ఇక..

సుప్రీంకోర్టులో ఏపీకి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఏపీకి ఎదురుదెబ్బ

పంచాయితీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో లోపాలున్నాయంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ శుక్రవారం పిటిషన్ ను తిరస్కరించగా, ప్రభుత్వం హుటాహుటిన హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికలు సాధ్యంకాదని, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. కానీ దాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అత్యవసరంగా విచారణ చేపట్టలేమన్న కోర్టు.. ఏపీ ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సోమవారం విచారిస్తానని తెలిపింది. కాగా..

తెలుగు జడ్జి చేతిలో ఎన్నికల భవితవ్యం..

తెలుగు జడ్జి చేతిలో ఎన్నికల భవితవ్యం..

హౌజ్ మోషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్లను విచారిస్తామని తెలిపింది. అంతేకాదు.. శనివారమే నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యాన్ని గుర్తిస్తూ.. అసాధారణ పరిస్థితుల్లో నోటిఫికేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉందని, సోమవారం వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ కేసును తెలగువారైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరావు నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది. ఇందులో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందూ మల్హోత్రా సభ్యులుగా ఉన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున.. ఆలోగా (శనివారం) నోటిఫికేషన్ ప్రకటించవద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డను సీఎస్ దాస్ కోరారు.

నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్ -సీఎం జగన్ ప్రతివ్యూహాలు -ఏజీతో భేటీ -ఏపీలో ఏం జరగబోతోంది?

English summary
amid panchayat elections, war is going between state election commissioner nimmagadda ramesh kumar and jagan government. govt says no to to sec orders on removal of officers. supreme court denies house motion petition of ap govt on friday. supreme court to hear special leave petition on this issue on monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X