వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 నెలల్లో: రాజధానిపై బాబు, సీఎంతో విభేదించిన కమిటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధానిపై ఏర్పడిన కమిటీ నివేదిక ఇచ్చిన మూడు నెలల్లో రాజధాని పేరును ఖరారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం చంద్రబాబును కలిసిన శివరామకృష్ణన్‌ కమిటీ అయింది. ఈ సందర్భంగా కమిటీ నివేదిక ఇచ్చిన 3 నెలల్లో రాజధాని పేరును ఖరారు చేస్తామని చంద్రబాబు కమిటీకి చెప్పారు. ఆ తరువాత కమిటీ అధికారులతో భేటీ అయింది.

కమిటీ చంద్రబాబుతో సమావేశం అయినప్పుడు.. రాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరం.. ఎలా సేకరించాలన్న విషయాలు చర్చకు వచ్చాయి. ఇవే ప్రశ్నలను శివరామకృష్ణన్‌ అధికారులతో సమావేశంలో అడిగారు. కనీసం 25-30 వేల ఎకరాల భూమి అవసరం ఉందని అనుకొంటున్నామని వారు చెప్పారు. భూ సేకరణకు నాలుగు రకాల ప్రత్యమ్నాయాలు ఉన్నాయన్నారు.

ఒకటి ప్రభుత్వ భూములు వినియోగించుకోవడం, ఆటవీ భూములను డీ నోటిఫై చేసి వినియోగించుకోవడం, ఎస్సైన్‌మెంట్‌ భూములను సేకరించడం, రైతులను భాగస్వాములను చేసి వారి నుంచి భూమి తీసుకోవడం.

Panel on new AP capital meet CM on Saturday

ప్రస్తుతం తమ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి మొదటి మూడు మార్గాల్లో తాము అనుకొన్నంత భూమి ఒకేచోట లభ్యం కావడం లేదని, నాలుగో మార్గంలోనే సేకరించాల్సి ఉంటుందని, ఒకచోట 30 వేల ఎకరాలు సేకరిస్తే అందులో మూడో వంతు భూమి రోడ్లు, పార్కులు వంటి ప్రజాహిత అవసరాలకు పక్కన పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. మిగిలిన దానిలో సగ భాగంలో ప్రభుత్వ భవనాలు, వచ్చే వాహనాలకు పార్కింగ్‌, హెలిపాడ్‌ వంటివి పెట్టాల్సి ఉంటుందని చెప్పారు.

ఇప్పటి అవసరాలే కాకుండా వచ్చే వందేళ్ళ అవసరాలు దృష్టిలో ఉంచుకొని అక్కడే అవసరమైన మరిన్ని భవనాల నిర్మాణానికి కూడా స్ధలం ఉంచుకోవాల్సి ఉంటుందని, మిగిలిన సగాన్ని భూమి ఇచ్చిన రైతులకు వారి వాటా కింద కేటాయించాల్సి ఉంటుందని,రాజధానికి సంబంధించిన భవనాల పక్కనే ఉండటం వల్ల ఈ భూమికి మంచి ధర వచ్చి రైతులకు లాభం కలుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తాను మొగ్గు చూపుతున్న విజయవాడ-గుంటూరు ప్రాంతంపైనా చర్చ జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ ముఖ్యమని చంద్రబాబు అధికారులతో అన్నారు. హైదరాబాదుకు పెట్టుబడులు తీసుకు రావడం కోసం తాను ఎంత కష్టపడిందీ ఈ సందర్భంగా చంద్రబాబు కమిటీ సభ్యులకు వివరించారు.

అప్పట్లో హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వచ్చే వారు కాదని, బేగంపేట విమానాశ్రయంలో పెద్ద విమానాలు నాలుగు దిగేలా, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేశానన్నారు. ఆ తర్వాత ఒక్కో సంస్థ వచ్చిందన్నారు. అక్కడ మిగులు ఆదాయం వచ్చాక రాష్ట్రమంతటికీ అభివృద్ధి ఫలాలు అందించాలని భావించానని చంద్రబాబు చెప్పారు. ఏపిలోను పరిపాలనా వ్యవస్థ ఒకేచోట ఉంటే పెట్టుబడులు సులువుగా ఆకర్షించవచ్చునని చెప్పారు.

అదే సమయంలో 11 జిల్లాల పరిధిలో పారిశ్రామిక కారిడార్లు, మరో 11 చోట్ల జాతీయ విద్యాసంస్థలు, రెండు జిల్లాల మధ్య పెట్రో కెమికల్ కాంప్లెక్స్, 12 చోట్ల ఎకనామిక్ నోడ్స్ తదితరాలతో అభివృద్ధిని వికేంద్రీకరిస్తామన్నారు. రామాయపట్నంలో గానీ, ఓడరేవు దగ్గరగా గాని కొత్తగా నౌకాశ్రయం రానుందని తెలిపారు. కాగా, పరిపాలనా వ్యవస్థ ఒకేచోట ఉండాలని బాబు అభిప్రాయపడగాక, అది కూడా రాష్ట్రమంతటా విస్తరించాలనే భావనను కమిటీ సభ్యులు వ్యక్తం చేశారు.

English summary
Panel on new Andhra Pradesh capital meet CM Chandrababu Naidu on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X