వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపినేని శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

'రజనీగంధ' కవితాసంపుటికి గాను ప్రముఖ కవి పాపినేని శివశంకర్ ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ కవి పాపినేని శివశంకర్ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. పాపినేని కవితా సంపుటి 'రజనీగంధ'కు గాను ఈ అవార్డు ప్రకటించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ అవార్డును బహుకరించనున్నారు. కాగా, పాపినేని శివశంకర్ స్వగ్రామం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నెక్కల్లు. తాత్త్వికమైన లోతులను స్పృశిస్తూ ఆధునిక తెలుగు కవిత్వంలో పాపినేని శివశంకర్ అగ్ర కవుల సరసన చేరారు. ఇప్పటివరకు 350కవితలు, 55 కథానికలు,220దాకా వ్యాసాలు పాపినేని శివశంకర్ కలం నుంచి జాలువారాయి.

Papineni Sivashanker got central literary award

స్తబ్దత-చలనం(1984), )ఒక సారాంశం కోసం (1990), ఆకుపచ్చని లోకంలో (1998)
ఒక ఖడ్గం - ఒక పుష్పం (2004),రజనీగంధ (2014) వంటి కవితా సంపుటాలను పాపినేని శివశంకర్ ఇప్పటివరకు వెలువరించారు. మట్టిగుండె (1992), సగం తెరిచిన తలుపు (2008) వంటి కథా సంపుటాలతో పాటు సాహిత్యం -మౌలిక భావనలు (1996) నిశాంత (2008) తల్లీ నిన్నుదలంచి (2012)సాహిత్య విమర్శ సంపుటాలు కూడా పాపినేని శివశంకర్ వెలువరించారు.

విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాల ప్రతిస్పందనే 'రజనీగంధ' : పాపినేని శివశంకర్

తన కవితా సంపుటి 'రజనీగంధ'కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడంపై కవి పాపినేని శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. రజనీగంధ తన ఐదో కవితా సంపుటి అని, ప్రపంచవ్యాప్తంగా విచ్చిన్నమవుతున్న మానవసంబంధాలు, వాటి విలువల గురించి తన కవితా సంపుటి ద్వారా స్పందించానని శివశంకర్ చెప్పారు.

దేశ విదేశాల్లో తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులు, పలువురు వ్యక్తుల విలక్షణతను రజనీగంధలో కవీత్వకరించినట్టుగా పాపినేని శివశంకర్ తెలిపారు. ఇప్పటిదాకా 60కథలు రాశానని, అందులో 'సముద్రం' అనే కథ తనకెంతో ఇష్టమని తెలియజేశారు.

English summary
Central literary academy was announced Papineni Sivashankers name for literary award of this year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X