• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌పై పరిపూర్ణానంద షాకింగ్‌- ఆ పోలిక నీకే ప్రమాదం-ఆ తర్వాతే తిరుపతికి రా

|

తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో ఏపీలో పార్టీల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఇదే క్రమంలో బీజేపీకి అండగా ఉన్న పీఠాధిపతులు కూడా ఇందులో భాగస్వామలవుతున్నారు. తాజాగా టీటీడీ ప్రధాన అర్చకుడిగా తిరిగి నియమితులైన రమణదీక్షితులు సీఎం జగన్‌ను విష్ణువుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. ఇప్పుడు స్వామి పరిపూర్ణానంద ఇదే విషయంపై జగన్‌కు హెచ్చరికలు చేశారు. అంతే కాదు రాయలసీమ నుంచి వచ్చిన సీఎంలెవరూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. రతనాలసీమను ఫ్యాక్షన్ గడ్డగా మారుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరిపూర్ణానంద కీలక వ్యాఖ్యలు

పరిపూర్ణానంద కీలక వ్యాఖ్యలు

ఏపీలో రెండు నెలల క్రితం చోటు చేసుకున్న వరుస ఆలయాల విధ్వంసం ఘటనలపై స్వామి పరిపూర్ణానంద మరోసారి స్పందించారు. ఇదే క్రమంలో టీటీడీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పలు పరిణామాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి మద్దతు ప్రకటించేందుకు వచ్చిన ఆయన.. సీఎం జగన్‌, చంద్రబాబు సహా రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులపైనా విమర్శలకు దిగారు. అంతే కాదు జగన్‌ను దేవుడితో పోలుస్తూ టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలపైనా పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విష్ణువుతో పోలిక జగన్‌కే ప్రమాదం

విష్ణువుతో పోలిక జగన్‌కే ప్రమాదం

తాజాగా టీటీడీ ప్రధాన అర్చకుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన పరిపూర్ణానంద సీఎం జగన్‌ను కలిసిన తర్వాత ఆయన్ను విష్ణువుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన పరిపూర్ణానంద... ఆ పోలిక జగన్‌కే ప్రమాదమన్నారు. సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు కూడా దీన్ని ఖండించాలని ఆయన సూచించారు. ఓ మనిషిని దైవంతో పోల్చడం సరికాదన్నారు. వెంకటేశ్వరస్వామితో పోల్చుకున్న వారు ఏమయ్యారో అందరికీ తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్‌కు మంట పుట్టించేలా ఉన్నాయి.

 ఫ్యాక్షన్‌ గడ్డ పేరు చెరిపేసే నాయకుడు రావాలి

ఫ్యాక్షన్‌ గడ్డ పేరు చెరిపేసే నాయకుడు రావాలి


రతనాల సీమ అయిన రాయలసీమను కొందరు ఫ్యాక్షన్ గడ్డగా మార్చారని, ఇప్పుడు ఫ్యాక్షన్ గడ్డ అనే పేరు చెరిపేసే నాయకుడు రావాలని పరిపూర్ణానంద ఆకాంక్షించారు. రాయలసీమను తిరిగి రతనాల సీమగా మార్చే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. జగన్‌పై నమ్మకంతో ఓట్లు వేసిన హిందువుల మనోభావాలను ఆయన కాపాడాలని పరిపూర్ణానంద సూచించారు. హిందువుల ప్రాధమిక హక్కుల రక్షణకు సీఎం జగన్ కట్టుబడాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తిరుపతిలో బీజేపీ గెలుపుతో రాయలసీమలో మార్పు

తిరుపతిలో బీజేపీ గెలుపుతో రాయలసీమలో మార్పు

రాయలసీమ నుంచి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వచ్చారని, రాయలసీమ నుంచి రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏ ఒక్క ముఖ్యమంత్రీ పాడుపడలేదని పరిపూర్ణానంద ఆరోపించారు. రాయలసీమ ఇప్పటికీ వెనుకపడిన ప్రాంతంగానే ఉంది. జాతీయ స్ధాయిలో ఎందుకు రాయలసీమ గుర్తింపు పొందలేదని సీమ నుంచి వచ్చిన సీఎంలను పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఇది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యమే అన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే మార్పు ఇక్కడి నుంచే ఆరంభమవుతుందన్నారు.

 సమాధానం చెప్పాకే జగన్ తిరుపతి రావాలి

సమాధానం చెప్పాకే జగన్ తిరుపతి రావాలి

తిరుపతి అంటే అందరికీ శ్రీ వెంకటేశ్వరస్వామి గుర్తుకువస్తారని, కానీ ఇప్పుడు కొందరు టీటీడీని తమ స్వార్ధం కోసం వాడుకుంటున్నారని పరిపూర్ణానంద ఆరోపించారు. గతంలో టీటీడీపై ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నేతతలు తిరుమల వెంకన్నను రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని పరిపూర్ణానంద సూచించారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. టీటీడీని ఎందుకు సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం లేదన్నారు. టీటీడీ ఆస్తులు, అభరణాలపై ఎందుకు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. జగన్ ఓట్లు అడగడానికి వచ్చేముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

మత సామరస్యం కాపాడతామని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులపై ఎందుకు మౌనంగా ఉన్నారని పరిపూర్ణానంద ప్రశ్నించారు.

English summary
swami paripoornananda on today made sensational comments on cm ys jagan and ttd head priest ramana deekshitulu over comparision of the jagan with god.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X