వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఆయన మూర్ఖుడు కాదు: పవన్ కళ్యాణ్ గుండుపై పరిటాల సునీత

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Head Shave Issue : పరిటాల రవి అప్పట్లో ఏమన్నారంటే ?

అనంతపురం: పరిటాల రవీంద్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టించారనే ప్రచారంపై మూడు రోజుల క్రితం జనసేనాని స్పందించారు. తాజాగా సోమవారం మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత కూడా ఈ అంశంపై మాట్లాడారు. పవన్ చెప్పింది వాస్తవమే అన్నారు.

పవన్ కళ్యాణ్‌కు తన భర్త పరిటాల రవి గుండు ఎందుకు కొట్టిస్తారని ఆమె అన్నారు. మా ఆయన అంత మూర్ఖుడు కాదని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు నిజాలు తెలుసుకోవాలని తాను కూడా కోరుతున్నానని చెప్పారు. పవన్‌కు గుండు కొట్టించారన్నది పూర్తి అవాస్తవం అని చెప్పారు.

పరిటాల గుండు కొట్టించలేదు, నేనే, ఊరుకునేవాడినా: పవన్, వంగవీటి రంగా హత్య, కులపిచ్చిపైనా..పరిటాల గుండు కొట్టించలేదు, నేనే, ఊరుకునేవాడినా: పవన్, వంగవీటి రంగా హత్య, కులపిచ్చిపైనా..

పవన్ కళ్యాణ్ నిజం చెప్పారు

పవన్ కళ్యాణ్ నిజం చెప్పారు

పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నిజం చెప్పారని, ప్రజలు అసత్యపు ప్రచారాన్ని నమ్మవద్దని పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. కాగా, తనకు పరిటాల రవి గుండు కొట్టించలేదని, అదంతా అబద్దమని, ఆనాడు తాను సినిమాలపై విరక్తితో తానే గుండు కొట్టించుకున్నానని పవన్ చెప్పిన విషయం తెలిసిందే.

అందుకే పవన్ నాడు మద్దతిచ్చారు

అందుకే పవన్ నాడు మద్దతిచ్చారు

చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని, రాష్ట్ర అభివృద్ధి కోసమే 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారని పరిటాల సునీత చెప్పారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి అందరికీ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కళ్లముందు కనిపిస్తున్నా బూటకంగా కనిపిస్తోందా

కళ్లముందు కనిపిస్తున్నా బూటకంగా కనిపిస్తోందా

నవ్యాంధ్ర అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం బూటకంగా కనిపిస్తోందని పరిటాల సునీత ధ్వజమెత్తారు. కాగా, వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్ర అనంతపురంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఉరవకొండలో ముగిసిన జగన్ పాదయాత్ర

ఉరవకొండలో ముగిసిన జగన్ పాదయాత్ర

జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఉరవకొండలో ముగిసింది. అనంతరం పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

English summary
Telugu Desam Party leader and Minister Paritala Sunitha on Monday said that Paritala Ravi did not tonsured Pawan Kalyan's head.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X