అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ ఆకస్మిక మృతి: స్పృహ తప్పిన సునీత

|
Google Oneindia TeluguNews

Recommended Video

పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ ఆకస్మిక మృతి

అనంతపురం: తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి ముఖ్య అనుచరుడైన చమన్(58) గుండెపోటుతో మృతి చెందారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక పర్యవేక్షణ కోసం వచ్చిన ఆయన మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్నారు.

కాగా, చమన్‌కు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్ మృతి చెందారు.

రవి హత్య అనంతరం అజ్ఞాతంలోకి

రవి హత్య అనంతరం అజ్ఞాతంలోకి

పరిటాల రవికి ఎంతో సన్నిహితుడైన చమన్‌ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో చమన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు.

సునీత మంత్రి అవడంతో..

సునీత మంత్రి అవడంతో..

2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, పరిటాల సునీత మంత్రి అవడంతో.. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు.

సునీత భావోద్వేగంతో

సునీత భావోద్వేగంతో

కాగా, కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సునీత చమన్.. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగానే చమన్ ఆకస్మికంగా మృతి చెందారు. చమన్ మృతి చెందారనే విషయం తెలియగానే అక్కడే ఉన్న సునీత ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరుయ్యారు.

స్పృహ తప్పిన సునీత

స్పృహ తప్పిన సునీత

కుమారుడు శ్రీరామ్ ఓదారుస్తుండగానే సునీత స్పృహతప్పి పడిపోయారు. వెంటనే శ్రీరామ్‌తో పాటు అక్కడున్నవాళ్లు పైకి లేపి ఆసుపత్రి బెడ్‌పై పడుకోబెట్టారు. అనంతరం వైద్యులు ఆమె ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి చికిత్స అందించారు. కాగా,
చమన్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చమన్ చాలా క్రియాశీలకంగా ఉండేవారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని అన్నారు. చమన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా సంతాపం ప్రకటించారు.

English summary
Paritala ravi follower Chaman died with heart attack on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X